రాష్ట్రీయం

రేషన్ డీలర్ల కమీషన్ పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: రేషన్ డీలర్లకు కమీషన్ పెంచుతున్నట్టు పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉప సంఘం ప్రకటించింది. రేషన్ డీలర్ల సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కమీషన్ పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి చేసిన సిఫారసు చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆమోదించడంతో ఉత్తర్వులు జారీ వెలువడ్డాయి.
సచివాలయంలో గురువారం మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు. రేషన్ డీలర్లకు ప్రస్తుతం కేజీకి 20 పైసల చొప్పున (క్వింటల్‌కు రూ.20) చెల్లిస్తుండగా ఇక నుంచి దీనిని కేజీకి 70 పైసలు (క్వింటల్‌కు రూ.70) చొప్పున పెంచుతున్నట్టు మంత్రివర్గ ఉప సంఘం వెల్లడించింది. పెంచిన కమీషన్ వచ్చే సెప్టెంబర్ నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. అలాగే డీలర్లకు చెల్లించాల్సిన బకాయిలను కూడా విడుదల చేయడానికి మంత్రివర్గ ఉప సంఘం అంగీకరించింది. డీలర్లు లేని రేషన్ షాపులకు త్వరలోనే డీలర్లను నియమిస్తామని, కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీలలో కూడా రేషన్ షాపులను ఏర్పాటు చేస్తామని పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు.
డీలర్ల సంఘం హర్షం
తమ సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కమీషన్ పెంచనున్నట్టు ప్రకటించడం పట్ల రేషన్ డీలర్ల రాష్ట్ర సంఘం హర్షం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం పట్ల ముఖ్యమంత్రికి, మంత్రివర్గ ఉప సంఘంలోని మంత్రులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయికోటి రాజు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.