రాష్ట్రీయం

గవర్నర్‌తో సీఎం భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: ‘అవునంటే కాదనిలే...కాదంటే అవుననిలే’ అన్నది టీఆర్‌ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సరిగ్గా సరిపోతాయని అంటారు. సీఎం మాటలకు అర్థాలు వేరేగా ఉంటాయని అయన్ను బాగా ఎరిగిన వారికి తెలుసు. ముందస్తు ఎన్నికల ప్రసక్తే లేదని బుధవారం మంత్రులతో జరిగిన భేటీలో సంకేతాలు ఇచ్చిన సీఎం కేసీఆర్, తెల్లారేసరికి ఇందుకు భిన్నంగా వ్యవహరించారన్న చర్చ జోరందుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు గురువారం ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను కలవడం, హైదరాబాద్‌లో గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ కావడంతో ముందస్తు ఎన్నికలపై ఉహాగానాలు జోరందుకున్నాయి. అలాంటి ఆలోచన ఏదీ లేకపోతే, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండగా, మరో వారం రోజుల్లో భారీ బహిరంగ సభ ఎందుకు నిర్వహిస్తారన్న అనుమానాలు కూడా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికలకు సీఎం కేసీఆర్ సన్నద్ధం అవుతున్నట్టు అనుమానిస్తున్న కాంగ్రెస్ పార్టీ ముందుగానే తేరుకుంది. రాహుల్ గాంధీతో హైదరాబాద్‌లో సభ పెట్టించింది. త్వరలో అన్ని నియోజకవర్గాలకు బహిరంగ సభల నిర్వహించనున్నట్టు ప్రకటించింది. అంతేగాక, ముందుగానే అభ్యర్థలకు టికెట్లు ఇస్తామని స్పష్టం చేసి, ముందస్తు ఊహాగానాలకు బలాన్నిచ్చింది. కాగా, ప్రతిపక్షాలు ఎన్నికలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాకముందే ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నది సీఎం కేసీఆర్ వ్యూహంగా అంచన వేస్తున్నారు. అయితే ప్రతిపక్షాలు కూడా అలర్ట్ కావడంతో వారిని అయోమయంలో పడేయడానికే ముందస్తు ఎన్నికలు ఉండవనే సంకేతాలను మంత్రులతో భేటీ తర్వాత సీఎం ఇచ్చి ఉండవచ్చేనే మరో వాదన కూడా ఉంది. మొత్తం మీద గురువారం గవర్నర్‌ను కేసీఆర్ కలవడం రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.