రాష్ట్రీయం

నేడు ఢిల్లీకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులతో కూడా సీఎం చర్చిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా కేంద్రం నుంచి ఆశించిన మేరకు స్పందన రావడం లేదని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తానే స్వయం గా వెళ్లి అవసరమైతే రెండు, మూడు రోజులు అక్కడే ఉండి పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవాలని కేసీఆర్ భావిస్తోన్నట్టు సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో
పేర్కొంది. మొత్తానికి రాష్ట్రానికి సంబంధించిన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రధాన మంత్రి వద్ద ప్రస్తావించాలని సీఎం నిర్ణయించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జోనల్ వ్యవస్థను కేంద్రం ఆమోదించాల్సి ఉంది. ఆ ప్రతిపాదనకు ఇంకా అమోదం లభించకపోవడంతో పంచాయతీ కార్యదర్శులతో పాటు మరికొన్ని నియామకాల్లో జాప్యం జరుగుతుందని సీఎం భావిస్తున్నారు. జోనల్ వ్యవస్థకు తక్షణం ఆమోద ముద్ర వేయడానికి చొరవ చూపాలని ప్రధానిని కోరాలని సీఎం నిర్ణయించారు. ఇప్పటికే ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ ఢిల్లీలోనే ఉండి రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై సమీక్షిస్తున్నారని పేర్కొన్నారు. అయినా ఆశించిన ఫలితం రావడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ఎఫ్‌ఆర్‌బీఎం నిధుల విడుదల, వెనుకబడిన జిల్లా అభివృద్ధి కోసం ఇవ్వాల్సిన రూ.450 కోట్లు, మహిళ సంఘాలు, రైతులకు ఇచ్చే రుణాలపై కేంద్రం ఇచ్చే వాటా విడుదల, హైకోర్టు విభజన, రీజినల్ రింగ్ రోడ్డుకు నిధులు, సచివాలయ నిర్మాణానికి రక్షణ శాఖ స్థలం కేటాయింపు తదితర అంశాలపై ప్రధాన మంత్రితో సీఎం చర్చిస్తారని పేర్కొన్నారు. సీఎం వెంట ఢిల్లీ వెళ్లే అధికారులలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణరావు తదితరులు ఉంటారని సీఎం కార్యాలయం వెల్లడించింది.