రాష్ట్రీయం

నీట్ యూజీలో పెరగనున్న సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 23: దేశ వ్యాప్తంగా మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి సంబంధించి ప్రవేశపరీక్ష నిర్వహణపై నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ స్పష్టత ఇవ్వడంతో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సన్నాహాలు ప్రారంభించింది. ముందు పరీక్ష నిర్వహణ వరకూ నేషనల్ టెస్టింగ్ ఏజన్సీ బాధ్యతలు తీసుకోగా, మెడికల్ కాలేజీల కౌనె్సలింగ్ బోర్డు అడ్మిషన్ల బాధ్యతను నెరవేర్చనుంది. 2019 నీట్ అడ్మిషన్లు జరిగే సమయానికి ఎంబీబీఎస్, బీడీఎస్ కలిపి లక్ష సీట్లకు చేరుకుంటాయని అంచనా వేస్తున్నారు. ఈసారి అమ్మాయిలకు సీట్లు బాగా పెరుగుతాయి. పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య కూడా బాగా పెరుగుతుందని భావిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1500 అదనపు సీట్లు పెరగనున్నాయి. తెలంగాణలో 600 సీట్లు, ఆంధ్రాలో 900 సీట్లుపెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. 2018 నీట్‌లో 13,26,725 మంది రిజిస్టర్ చేసుకోగా, అందులో అబ్బాయిలు 5,80,648, అమ్మాయిలు 7,46,076 మంది ఉన్నారు. ఇందులో 12,69,922 మంది పరీక్ష రాయగా వారిలో 7,14,562 మంది అర్హత సాధించారు. దేశవ్యాప్తంగా 778 కాలేజీల్లో 65,170 ఎంబీబీఎస్, 25,730 బీడీఎస్ సీట్లున్నాయి. అయితే ఆఖరి నిమిషంలో జరిగిన చేర్పులు, మార్పులతో దేశవ్యాప్తంగా 426 మెడికల్ కాలేజీల్లో 53,455 యూజీ సీట్లు, డెంటల్ కాలేజీల్లో 25,900 యూజీ సీట్లు , మొత్తం 79,355 సీట్లకు అడ్మిషన్లు జరిగాయి. 2017 నీట్‌లో 11.5 మంది అభ్యర్ధులు రిజిస్టర్ చేసుకోగా, 2016లో జరిగిన నీట్‌లో 7.5 లక్షల మంది మాత్రమే రిజిస్టర్ చేసుకున్నారు. తొలిసారి నీట్‌ను 2013లో నిర్వహించారు. 2014లో నీట్‌ను రద్దు చేశారు. తిరిగి జాతీయ స్థాయిలో ఉమ్మడిగా ఒకే ప్రవేశపరీక్ష నిర్వహించేందుకు వీలుగా నీట్‌ను అమలులోకి తెచ్చారు. తొలుత 2019 నీట్‌ను ఏటా రెండు మార్లు, ఆన్‌లైన్‌లో నిర్వహించాలని భావించినా, ఇటీవల జరిగిన బోర్డు సమావేశంలో 2019లో నీట్ పరీక్షను ఒకే మారు నిర్వహించాలని నిర్ణయించారు. అదీ ఆఫ్ లైన్‌లోనే పెన్ను పేపర్ పద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. దేశవ్యాప్తంగా 136 పట్టణాల్లో 11 భాషల్లో నీట్‌ను నిర్వహించనున్నారు. ఆంగ్లభాష ఆధారంగా నీట్ పేపర్‌ను వివిధ ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా చేయనున్నారు. కనుక తర్జుమాలో ఎలాంటి పొరపాట్లు జరిగినా దానికి నేషనల్ టెస్టింగ్ ఎలాంటి బాధ్యత వహించబోదని కూడా చెబుతున్నారు. ఆంగ్ల మూలం చూసుకుని ప్రశ్నకు ప్రాంతీయ భాషలో సమాధానం రాయడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు.