రాష్ట్రీయం

అమరావతికి వనె్న తెండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 23: పర్యావరణ సమతుల్యత పాటించేలా భవన నిర్మాణాలను చేపట్టాల్సిన బాధ్యత యువ ఆర్కిటెక్ట్‌లదేనని ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు అన్నారు. భావితరాలకు మార్గదర్శిగా నిలిచే మన రాజధాని అమరావతి నిర్మాణంలో యువ ఆర్కిటెక్ట్‌లు తమ ప్రతిభను చూపించి పేరు ప్రఖ్యాతలు తేవాలన్నారు. విజయవాడలో 10 ఎకరాల స్థలంలో రూ. 154 కోట్లతో నిర్మితమైన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నూతన భవన సముదాయాలను గురువారం గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్‌తో కలిసి ప్రారంభించి అనంతరం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో జరిగిన ఆర్కిటెక్చర్ కళాశాల మూడవ స్నాతకోత్సవ వేడుకల్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ కన్నతల్లిని, జన్మభూమిని, మాతృభాషను, గురువును ఎన్నడూ మరవరాదన్నారు. ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించాలని, ప్రకృతితో కలిసి అడుగులు వేయాలన్నారు. దేశ భవిష్యత్ ఆర్కిటెక్చర్లపై ఆధారపడి ఉందని, పర్యావరణ హితంగా భవన నిర్మాణాలకు రూపకల్పన చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. భవన నిర్మాణాల ఆకృతుల రూపకల్పన సమయంలో వెలుతురుకు, గాలికి తగిన ప్రాధాన్యత కలిగించేలాగా పర్యావరణ సమతుల్యత పాటించే విధంగా సూచనలు చేయాల్సి ఉందన్నారు. ‘చరక’, ‘ఆర్యభట్ట’ వంటి ఎందరో గొప్ప వ్యక్తులు ఇక్కడ జన్మించారన్నారు. జాతీయ స్థాయిలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఐఐటీ, ఎయిమ్స్ వంటి ఎన్నో ఉన్నతమైన విద్యా సంస్థలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించగా, నిర్మాణాలు జరుపుకుంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలోనే వేదాల కాలంలోనే భవన నిర్మాణాల, నగర నిర్మాణాల స్థూల వివరణ పేర్కొన్నారన్నారు. గతంలో నిర్మాణాలను చేపట్టే సమయంలోనే రహదారులకు, మురుగుపారుదల వ్యవస్థకు, వౌలిక వసతులకు ఒక క్రమపద్ధతిలో ప్రాధాన్యత ఇచ్చేవారన్నారు. భారత ప్రభుత్వ మానవవనరుల శాఖ కార్యదర్శి రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్‌లో రూ. 5వేల కోట్లతో ఉన్నత స్థాయి విద్యా సంస్థలను నెలకొల్పుతున్నామన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, స్పా కాలేజీ విజయవాడ చైర్మన్ బృందాసోమయా, డైరెక్టర్ డా మీనాక్షిజైన్, యువ ఆర్కిటెక్చర్లకు అభినందలు తెలిపారు. స్నాతకోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధించిన 10 మందికి, ఉత్తమ పరిశోధన పత్రాలు రూపొందించిన 12 మంది విద్యార్థులకు 2017, 2018 సంవత్సరాలలో పట్ట్భద్రులైన 280 మందికి డిగ్రీ పట్టాలను అందజేశారు.

చిత్రం..కార్యక్రమంలో మాట్లాడుతున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు