రాష్ట్రీయం

పర్యాటకం పరిఢవిల్లాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: విశాఖపట్నంలో సబ్‌మెరైన్ హెరిటేజ్ మ్యూజియం ఏర్పాటుకు మాస్టర్‌ప్లాన్ రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. పర్యాటకానికి ఆతిథ్యం అతిముఖ్యమని స్పష్టం చేసిన ఆయన అతిథుల అభిమానం పొందటం వల్లే పర్యాటక అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పర్యాటకుల రాక ఆయా విభాగాల తీరుపై ఆధారపడి ఉందని ఉద్ఘాటించారు. శుక్రవారం తన కార్యాలయంలో టూరిజం అభివృద్ధి బోర్డ్ సమావేశం నిర్వహించిన చంద్రబాబు విశాఖలో సబ్‌మెరైన్ హెరిటేజ్ మ్యూజియం అటు విజ్ఞానం..ఇటు వినోదాన్ని పంచాలని ఆకాంక్షించారు. ఈ మ్యూజియం ద్వారా ప్రజల్లో ఆసక్తితో పాటు దేశభక్తి పెరుగుతుందని పేర్కొన్న ఆయన దేశ రక్షణలో నావికాదళ కృషి ఈ మ్యూజియంలో ఉట్టిపడాలని సూచించారు. పారిస్‌కు ఈఫిల్‌టవర్‌లా, ఆగ్రాకు తాజ్‌మహల్‌లా విశాఖ సబ్‌మెరైన్ మ్యూజియం ప్రత్యేక ఆకర్షణగా నిలవాలన్నారు. అండర్‌గ్రౌండ్ పార్కింగ్ సహా మ్యూజియం భవన నిర్మాణంలో ఆధునికత పద్ధతులను అనుసరించాలన్నారు. విజయనగరం జిల్లా చింతపల్లి వద్ద స్కూబా డైవింగ్, విశాఖ, విజయనగరం జిల్లాల్లో స్కై స్కూల్ యాక్టివిటీస్‌ను ప్రోత్సహించాలన్నారు. కళింగపట్నంను పర్యాటకంగా అభివృద్ధి పరచాలని ఆదేశించారు. ఇందుకోసం ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరపాలన్నారు. స్కై స్కూల్ అక్టోబర్ 2 నాటికి సిద్ధం చేయాలని నిర్దేశించారు. ప్రకాశం బ్యారేజ్ ఎగువన వైకుంఠపురం ఎత్తిపోతల పథకం, దిగువన చోడవరం ఎత్తిపోతల పూర్తయితే రాజధాని ప్రాంతంలో కృష్ణానది వాటర్‌ఫ్రంట్ ఆసాంతం అద్భుతంగా ఉంటుందని తెలిపారు. అదే తరహాలో ఉత్తరాంధ్రలో పురుషోత్తపట్నం ప్రాజెక్ట్ నుంచి 50 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేయాలన్నారు. కనిష్ఠ పెట్టుబడి, గరిష్ఠ భాగస్వామ్యం లక్ష్యంగా టూరిజం అభివృద్ధి చేయాలని ఆదేశించారు. ప్రతివారం జరుగుతున్న ఆనందలహరి కార్యక్రమాన్ని మరింత ప్రోత్సహించాలన్నారు. పౌరుల్లో అంతర్గత ప్రతిభ గుర్తించి ప్రోత్సహించడం ద్వారా వారి భాగస్వామ్యాన్ని పెంచాలన్నారు. క్యాబ్ డ్రైవర్లు,
ఇతర వ్యాపార వర్గాలు అందరితో ఎప్పటికప్పుడు భేటీలు నిర్వహించి వారిని చైతన్యపరచాలన్నారు. అంతర్జాతీయ పర్యాటకులు ఆంధ్రప్రదేశ్ సందర్శనకు ఆసక్తి చూపేలా పర్యాటక రంగాన్ని తీర్చిదిద్దాలని పునరుద్ఘాటించారు. పర్యాటకుల భద్రత, రక్షణ పటిష్టంగా ఉండాలని అక్కడక్కడ పర్యాటకులపై దాడులకు పాల్పడేవారు, దొంగతనాలు చేసే వారి పట్ల అప్రమత్తంగా వ్యవహరించి కఠినంగా శిక్షించాలన్నారు. డ్రోన్ల ద్వారా ఆయా ప్రాంతాల్లో నిఘా ముమ్మరం చేయాలన్నారు. కోటప్పకొండ వద్ద పర్యాటకాన్ని బాగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. అదేవిధంగా యారాడ కొండలను మరింత సుందరంగా తీర్చిదిద్దాలన్నారు. భవానీ ద్వీపంలో 75 ఎకరాల్లో మరో రెండు రిసార్టులను అభివృద్ధి చేయాలని సూచించారు. భవానీ ద్వీపానికి సందర్శనకు రోజుకు రెండువేల మంది వస్తుంటే అక్కడి లేజర్ షోకు 500 మంది కూడా హాజరు కావటం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. లేజర్‌షో ఆకర్షణీయంగా ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. గ్రామ పర్యాటకాన్ని ప్రోత్సహించాలన్నారు. స్థానిక జానపదాలకు ప్రాధాన్యత ఇవ్వాలి.. గ్రామదర్శిని..నగరదర్శినిలో రానున్న 5 నెలల్లో 774 కళాకారుల బృందాలకు వర్క్‌షాప్ నిర్వహించాలని ఆదేశించారు. దైనందిన ఒత్తిళ్ల నుంచి ప్రజలు ఆటవిడుపు కోరుకుంటారు.. అదే పర్యాటకం అభివృద్ధికి అద్భుత అవకాశంగా చెప్పారు. ప్రజల్లో ఉన్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత టూరిజం శాఖదే అని స్పష్టంచేశారు. ప్రభుత్వంపై స్పందనలు పర్యాటక రంగం ద్వారానే బయటకు వస్తాయన్నారు. ప్రభుత్వ ముఖచిత్రం పర్యాటకమే అన్నారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న శాఖలో ఏ మాత్రం నిర్లక్ష్యం, అవినీతి జరిగినా ఆ ప్రభావం ప్రభుత్వంపై పడుతుందని హెచ్చరించారు. విజన్ ఇస్తున్నా, విధానాలు రూపొందిస్తున్నా, మందకొడిగా ఉండటం సరికాదని ఆగ్రహం వ్యక్తంచేశారు. టూరిజం కార్యకలాపాలు వేగవంతం చేయాలన్నారు. పర్యాటక, సాంస్కృతిక శాఖలు, జలవనరులు, పట్టణాభివృద్ధిశాఖలు సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌లో పర్యాటక అభివృద్ధికి చేసిన కృషిని గుర్తు చేశారు. ప్రకృతి సుందర దృశ్యాలున్న 13 జిల్లాల ఏపీలో పర్యాటకం మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు.

తపాలాబిళ్లల ఆవిష్కరణ
రాష్ట్రంలో 12 పర్యాటక స్థలాలపై రూపొందించిన తపాలా బిళ్లలను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదలచేశారు. ఏపీ పర్యాటకంలో తపాలాశాఖ భాగస్వామ్యం వహించటం పట్ల హర్షం వ్యక్తంచేశారు. దేశంలో ప్రస్తుతం మూడవ స్థానంలో ఉన్న పర్యాటక రంగాన్ని మొదటి స్థానంలోకి తెచ్చే కృషి జరగాలన్నారు. ఈ రంగం ద్వారా భారీ ఉపాధి అవకాశాలు ఉన్నాయని యువతరం పర్యాటకరంగంలో ఉపాధిని సద్వినియోగం చేసుకోవాలని హితవు పలికారు. సమావేశంలో మంత్రి అఖిల ప్రియ, పర్యాటకశాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, హిమాంశు శుక్లా, పట్టణాభివృద్ధిశాఖ కార్యదర్శి కరికాల వలవన్, సీఎంఒ కార్యదర్శులు గిరిజాశంకర్, రాజవౌళి, జస్వంత్‌కుమార్, విజయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం..టూరిజం ప్రమోషన్ బోర్డు సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు