రాష్ట్రీయం

శోభాయమానంగా వరలక్ష్మీవ్రతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఆగస్టు 24: సిరుల తల్లి తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఉదయం వరలక్ష్మీ వత్రాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయం వద్ద ఉన్న ఆస్థాన మండపంలో పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చకులు వరలక్ష్మీ వ్రతాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వేకువ జామునే అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీపద్మావతి అమ్మవారి ఉత్సవ మూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేశారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చాన, అష్టోతర శత నామావళిని భక్తిశ్రద్దలతో నిర్వహించారు. ఈ సందర్భంగా సిరుల తల్లిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసీ, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి, తామరపూలు, మొగళిరేకులు వంటి సాంప్రదాయ పుష్పాలతో అమ్మవారిని ఆరాధించారు. ఆస్థానమండపాన్ని అష్టలక్ష్మీ మూర్తులతో, రోజాలు, తామరపూలతో శోభయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా అమ్మవారిని తొమ్మిది గ్రంథులతో (నూలుపోగు) అలంకరించారు. ఒక్కోగ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు. అనంతరం వేంకటాచల మహత్యం, స్కాంద పురాణంలో సూత మహర్షి వివరించిన వరలక్ష్మీ వ్రత మహత్యాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు భక్తులకు తెలియజేశారు. అనంతరం ఐదు రకాల కుడుములు, ఇడ్లి, కారంతో చేసిన ఇడ్లి, తియ్యటి ఇడ్లి, లడ్డూ, వడ, అప్పం, పోలి వంటి 12 రకాల నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హారతితో వరలక్ష్మీ వత్రం ముగిసింది. వరలక్ష్మీ వ్రతాన్ని పురస్కరించుకుని అమ్మవారికి బంగారు చీరతో విశేషాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్‌కుమార్ సింఘాల్ ఇతర అధికారులు పాల్గొన్నారు.
చిత్రం..వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారు