రాష్ట్రీయం

డీఎస్ ఉన్నారు.. హుష్ గప్‌చుప్...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ‘రాజ్యసభ సభ్యుడు డీఎస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసినట్టు పక్కా సమాచారం. ఆయనపై క్రమశిక్షణా చర్య తీసుకోవాలని పార్టీ అధినేత కేసీఆర్‌ను కోరుతూ ప్రజాప్రతినిధులమంతా ఏకగ్రీవంగా తీర్మానం చేసాం’ అని నిజామాబాద్ ఎంపీ, స్వయంగా సీఎం కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నెలన్నర కిందట బాహాటంగా ఆరోపించిన విషయం తెలిసిందే. అదే డీఎస్ శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఇందులో పార్టీ ప్రజా ప్రతినిధులకు ముందస్తు ఎన్నికల వ్యూహ, ప్రతి వ్యూహాన్ని పార్టీ అధినేత కేసీఆర్ వివరిస్తారని భావించారు. అయితే ఈ సమావేశంలో ముందస్తు ఎన్నికలకు వెళ్లే అంశంపై ఎలాంటి వివరాలు ప్రస్తావించకుండా కేసీఆర్ గోప్యత పాటించారు. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో డీఎస్‌కు సత్ససంబంధాలు ఉన్నాయని నిజామాబాద్ జిల్లా పార్టీ నేతలు స్వయంగా ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన పార్టీ విస్తృత సమావేశానికి డీఎస్ కూడా హాజరు కావడం వల్లనే ముందస్తు ఎన్నికల వ్యూహ, ప్రతి వ్యూహాల పట్ల పార్టీ అధిష్టానం గోప్యతను పాటించి ఉండవచ్చని సీనియన్ నేత ఒకరు వ్యాఖ్యనించారు. మొత్తానికి డీఎస్ హాజరు, కేసీఆర్ ముక్తసరి ప్రసంగానికి కారణం కావచ్చని భావిస్తున్నారు.