రాష్ట్రీయం

కేసీఆర్ ఎన్నికల వరాల జల్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు మరోసారి వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీలకు గృహోపయోగ విద్యుత్తును 101 యూనిట్ల వరకూ ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉ చిత విద్యుత్తు అందిస్తున్నామని, టీవీల వినియోగంతో పాటు ఇతర విద్యుత్తు గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్తు వాడకం ఎక్కువైందని, దీనికి అయ్యే ఛార్జీలను ప్రభుత్వమే డిస్కాంలకు చెల్లిస్తుందన్నారు.
అర్చకులకు ప్రభుత్వ వేతనాలు
రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిథిలో నిర్వహిస్తున్న దేవాలయాల్లో పూజా కార్యక్రమాలు నిర్వహించే అర్చకులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే ఇకపై ప్రభుత్వమే నేరుగా వేతనాలు చెల్లిస్తుందని కేసీఆర్ ప్రకటించారు. వచ్చే నెల 1 నుంచి ప్రభుత్వ ఖజానా నుంచి ఈ వేతనాలు అందిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు సవరించినప్పుడు, పూజారుల వేతనాలను కూడా విధిగా సవరిస్తామని చెప్పారు. అంతేకాకుండా పూజారుల పదవీ విరమణ వయో పరిమితిని 58 నుంచి 65 సంవత్సరాలకు పెంచుతున్నట్లు సీఎం తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోమవారం జారీ అవుతాయి.
ఇమామ్, వౌజమ్‌లకు నెలకు రూ.5 వేలు భృతి
మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, వౌజమ్‌లకు నెలకు రూ.5 వేల భృతిని వచ్చే నెల 1వ తేదీ నుంచి చెల్లించనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రకటించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రాష్ట్రంలో వౌజమ్, ఇమామ్‌లకు మొదట నెలకు వెయ్యి రూపాయలు ఉండేదని, ఆ తర్వాత దానిని రూ.1500లకు పెంచడం జరిగిందని, ఇప్పుడు ఆ భృతిని రూ.5 వేలకు పెంచుతున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి నిర్ణయంతో మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించే సుమారు 9 వేల మందికి మేలు జరుగుతుంది.
29 మినీ గురుకులాల్లో..
29 మినీ గురుకులాల్లో పని చేస్తున్న ఉద్యోగుల వేతనాలు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. హెచ్‌ఎం/వార్డెన్‌కు రూ.5 వేల నుంచి 21 వేలకు, సిఆర్టీలకు రూ.4 వేల నుంచి రూ.15 వేలకు, పిఇటిలకు రూ.4 వేల నుంచి రూ.11 వేలకు, అకౌంటెంట్‌కు రూ.3,500 నుంచి రూ. 10,000కు, ఏఎన్‌ఎంలకు రూ.4 వేల నుంచి రూ.9 వేలకు, కుక్స్‌కు రూ. 2,500 నుంచి రూ.7,500కు, స్వీపర్‌కు రూ.2,500 నుంచి రూ.7,500కు, వాచ్ మెన్‌కు రూ.2,500 నుంచి రూ.7,500 పెంచుతున్నట్లు ప్రకటించారు.