రాష్ట్రీయం

శ్రీశైలానికి తగ్గిన వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, ఆగస్టు 24: శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గింది. ఎగువ తుంగభద్ర నుంచి పూర్తిస్థాయిలో వరద తగ్గగా కృష్ణానది నుంచి గణనీయంగా తగ్గిపోయింది. జలాశయానికి నీటి చేరిక పడిపోవడంతో ప్రాజెక్టు నుంచి దిగువ నాగార్జున సాగర్‌కు నీటి విడుదలను తగ్గించారు. గురువారం తెరిచిన ఎనిమిది గేట్లలో శుక్రవారం ఉదయం నాలుగు గేట్లు మూసివేశారు. జలాశయం నీటిమట్టం 883.10 అడుగులుగాను, నీటినిల్వ 205.25 టీఎంసీలుగా నమోదైంది. తుంగభద్ర నుంచి 33,088 క్యూసెక్కులు, కృష్ణా నుంచి 1,32,578 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,65,666 క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి చేరుతోంది. కుడి విద్యుత్ కేంద్రం నుంచి 31,391 క్యూసెక్కులు, ఎడమ విద్యుత్ కేంద్రం నుంచి 42,378 క్యూసెక్కులు, నాలుగు క్రష్ట్‌గేట్లు ఒక్కోటి 10 అడుగుల మేర ఎత్తి 1,08,912 క్యూసెక్కులు కలిపి మొత్తం 1,82,812 క్యూసెక్కుల నీరు సాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, హంద్రీ-నీవా ద్వారా 2,363 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 24 వేల క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారు. జలాశయం నుంచి మొత్తం 2,11,344 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. కాగా శనివారం మరో రెండు గేట్లు మూసి వేసి జలాశయంలో నీటిమట్టం 884 అడుగుల మేర నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.