రాష్ట్రీయం

సింగరేణి ఉద్యోగులకు 29న బోనస్ చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్లో 27 బోనస్) శాతాన్ని ఈనెల 29న రూ.327 కోట్ల రూపాయలను కార్మిక, ఉద్యోగులకు చెల్లిస్తున్నట్లు యాజమాన్యం ప్రకటించింది. ఈ మేరకు సంస్థ సిఎండి శ్రీ్ధర్ ఆదేశాలు జారీ చేశారు. ఇటీవల సింగరేణి ఉద్యోగ, కార్మికులు తమకు రావాల్సిన లాభాల్లో వాటా గురించి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. అందుకు స్పందించిన సిఎం తక్షణ లాభాల్లో 27 శాతం వాటా విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. సింగరేణి సంస్థలో దాదాపు 50వేలకు పైగా ఉద్యోగ, కార్మికులు ఉన్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి రూ, 1212 కోట్ల రూపాయలు లాభాలను ఆర్జించింది. గతంలో ఎన్నడూ ఈమేరకు లాభాలు రాలేదని యాజమాన్యం ప్రకటించింది. ఉద్యోగ, కార్మికులు ఉమ్మడి కృషి ఫలితమే లాభాలకు మూలమని సిఎండి పేర్కొన్నారు. గతంలో 10-18 శాతం లాభాలు ఉండేవని తెలంగాణ ఆవిర్భావంతో సింగరేణిలో గణనీయంగా లాభాలు వచ్చాయన్నారు.1999 సంవత్సరం నుంచి సంస్థకు వచ్చిన లాభాలను పంచడం ఆనవాయితీగా వస్తోందని ఆయన చెప్పారు.అధికారులకు చెల్లించాల్సిన పిఆర్‌పి నిధులను దాదాపు రూ 22 కోట్ల రూపాయలను సెప్టెంబర్ 5వ తేదీన చెల్లించడానకి యాజమాన్యం సిద్ధం చేస్తోందని, లాభాల వాటాలను ఏ ప్రభుత్వ రంగ సంస్థ కాని, కోల్ ఇండియాలో కూడా ఇలాంటి నిర్ణయాలు జరగలేదని సిఎండి శ్రీ్ధర్ తెలిపారు.