రాష్ట్రీయం

సింహాచలం నార్త్‌లో హాల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 24: విశాఖ రైల్వేజంక్షన్‌లో పెరుగుతున్న రైళ్ల రాకపోకల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణమధ్య రైల్వే అధికారులు కాచిగూడ-టాటానగర్ మధ్య వారానికోసారి నడిచే ప్రత్యేక రైళ్లకు సింహాచలం నార్త్ స్టేషన్‌లో ‘హాల్ట్’ సౌకర్యం కల్పిస్తున్నారు. కాచిగూడ నుంచి బయలుదేరే రైలు నెం.07438 ఇక సింహాచలం నార్త్ స్టేషన్‌కు తెల్లవారుజామున 1.30కు చేరుకుని తిరిగి 1.31 నిమిషాలకు బయలుదేరుతుంది. అలాగే తిరుగు ప్రయాణంలో రైలు నెం.07439 మధ్యాహ్నం 2.30కు చేరుకుని తిరిగి 2.35 నిమిషాలకు బయలుదేరుతుంది.
గుడివాడ-మచిలీపట్నం మధ్య
పాక్షికంగా కొన్ని రైళ్ల రద్దు
మరమ్మత్తులు కారణంగా గుడివాడ-మచిలీపట్నం రైలు మార్గంలో ఈ నెలాఖరు వరకు కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దుచేసి మరికొన్ని రైళ్ల రాకపోకల్లో స్వల్ప మార్పులు చేశారు. విజయవాడ-మచిలీపట్నం డెమో ప్యాసింజర్ రైలు నెం.77269ను ఈ నెల 31వ తేదీ వరకు అలాగే మచిలీపట్నం-విజయవాడ డెమో ప్యాసింజర్ రైలు నెం.77270ను సెప్టెంబర్ 1వ తేదీ వరకు రద్దు చేశారు. మచిలీపట్నం-విజయవాడ డెమో ప్యాసింజర్ రైలు నెం.77208ను సెప్టెంబర్ 1వ తేదీ వరకు రద్దు చేశారు.