రాష్ట్రీయం

రేణిగుంట నుంచి పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, ఆగస్టు 24: దక్షిణ మధ్య రైల్వే మొదటిసారిగా రేణిగుంట నుంచి పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు సర్వీసులను శుక్రవారం నుండి ప్రారంభించింది. ఈ సందర్భంగా రైల్వే కమర్షియల్ ఇన్స్‌పెక్టర్ సాధిక్‌బాషా మాట్లాడుతూ దక్షిణ మధ్య రైల్వేస్‌లో మొదటిసారిగా రేణిగుంట నుంచి అసోం రాష్ట్రంలోని గౌహతి వరకు కార్గో ఎక్స్‌ప్రెస్ సర్వీసును ప్రారంభించినట్లు తెలిపారు. ఈ రైలు ప్రతి నెల మొదటి గురువారం, 3వ గురువారం ఇక్కడ నుండి బయలుదేరి, 5 రోజులకు గమ్యస్థానం చేరుతుందన్నారు. అదేవిధంగా గౌహతి నుంచి అక్కడి సరుకులను లోడ్ చేసుకుని రేణిగుంటకు తరలిస్తారన్నారు. ఈ కార్గో రైలు గుంతకల్లు, సికింద్రాబాద్, విజయవాడ, వైజాగ్, కలకత్తా మీదుగా గౌహతికి వెళ్తుందన్నారు. ఈ కార్గో రైలు ప్రస్తుతానికి 15 పెట్టెలతో నడుపుతున్నామని, జనవరి నుంచి 21 పెట్టెలతో నడుస్తుందన్నారు. ప్రస్తుతానికి రేణిగుంట నుంచి గౌహతి వరకు ఒక సారి రవాణా చేసినందుకు గాను రూ. 12.50లక్షల ఆదాయం వస్తుందని, జనవరి నుంచి 21 పెట్టెలతో నడిపితే రూ. 18లక్షలు రైల్వేకు ఆదాయం వస్తుందని వివరించారు. చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లోని పారిశ్రామికవాడకు చెందిన పరికరాలను, మామిడికాయలు, టమోటాలు, సిమెంటు, తరలించేందుకు సులువుగా ఉంటుందన్నారు.
లారీల్లో రోడ్డు ప్రయాణం ద్వారా సరుకు రవాణాతో పోలిస్తే పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ రైలులో రేట్లు చాలా తక్కువన్నారు. శుక్రవారం సాయంత్రం సరకుతో రవాణా కావాల్సిన పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యం కావడంతో శుక్రవారం రాత్రి మొత్తం లోడింగ్ చేయించి శనివారం తెల్లవారుజామున గౌహతికి రైలు బయలుదేరుతుందన్నారు. అతి తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం సరకును ఈ పార్శిల్ కార్గో ఎక్స్‌ప్రెస్ రైలు ద్వారా ఉపయోగించుకోవచ్చని గుర్తుచేశారు.
అదేవిధంగా గౌహతి ప్రాంతంలో ఎక్కువగా రవాణాచేసే వస్తువులు ఈ ప్రాంతానికి రానున్నాయన్నారు.