రాష్ట్రీయం

హిందూపురంలో ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం: అనంతపురం జిల్లా హిందూపురంలో ఓ స్వచ్చంద సంస్థ చేపట్టిన సర్వే ఉద్రిక్తతకు దారితీసింది. అధికార పార్టీకి చెందినదిగా భావిస్తున్న స్పార్క్ సంస్థ ప్రతినిధులు గత మూడు రోజులుగా హిందూపురంలో ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారు. కొంతమంది ఎంపిక చేసిన యువకులకు ఓ ప్రశ్నావళిని ఇచ్చి ప్రజల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. అయితే ఈ సర్వే వైకాపాను నిర్వీర్యం చేసేదిగా ఉందంటూ స్థానిక నాయకులు వారిని అడ్డుకున్నారు. సర్వే సామగ్రి, పేపర్లు స్వాధీనం చేసుకున్నారు. దీంతో శుక్రవారం రాత్రి, శనివారం పురంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైకాపా వారు తమపై దాడి చేశారని సర్వే బృందం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వైకాపా నేత నవీన్ నిశ్చల్‌ను అరెస్టు చేసేందుకు రంగం సిద్ధం చేశారు. నాటకీయపరిణామాల మధ్య ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. వైకాపా శ్రేణులను ప్రలోభపెట్టి టీడీపీవైపు తిప్పుకునేలా ఈ సర్వే ఉందని నవీన్ నిశ్చల్ ఆరోపించారు. పురంలో పార్టీ శ్రేణులను భయభ్రాంతులకు గురిచేసే సర్వేను అడ్డుకున్నామే తప్ప తాము ఎవరిపై దాడి చేయాలేదని ఆయన స్పష్టం చేశారు. పార్టీ కౌన్సిలర్లకు ఫోన్ ద్వారా బెదిరింపులు వచ్చాయన్నారు. పోలీసులు సర్వే బృందాన్ని అడ్డుకోకపోగా తమపైనే కేసులు బనాయించాలని చూస్తున్నారని ఆరోపించారు.