రాష్ట్రీయం

వణుకుతున్న లంకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 25: గోదావరి నదికి వరదలు కొత్తకాదు..గోదావరి వరద చరిత్రలో ఎన్నో అనుభవాలు లంక గ్రామాల వాసులు తరతరాలుగా చవిచూశారు. 1986లో వచ్చిన వరదలే ప్రామాణికంగా ఏటిగట్లను పటిష్టపర్చారు. అయితే సక్రమ పర్యవేక్షణ లేకపోవడం వల్ల ఏటిగట్లు అక్కడకక్కడా బలహీనపడ్డాయి. ఫలితంగా, ఏటిగట్ల పరీవాహ లంక గ్రామాలు వరదల సమయంలో వణికిపోతున్నాయి. ప్రజలు ప్రాణాలరచేత పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు. దీనికి తోడు లంక ప్రాంతాలు శరవేగంగా కోతకు గురవుతుండటంతో వరదల సమయంలో లంక గ్రామాలకు కంటిమీద కునుకు కరవైంది.
గోదావరి నది వరద చరిత్రను పరిశీలిస్తే..ఎన్నో సార్లు ప్రమాదపుటంచులను తాకుతూ గ్రామాలను ముంచెత్తింది. ఎండా కాలంలో చిక్కి శల్యమవుతోన్న గోదావరి నదికి వరదలు వచ్చాయంటే చాలు ఊళ్లను చుట్టేస్తూ..లంకలను భయకంపితం చేస్తూ పరీవాహక ప్రాంతానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంత జరుగుతున్నా గోదావరి నదిని సక్రమంగా పర్యవేక్షించే పరిస్థితి మాత్రం పాలకుల్లో కన్పించడం లేదు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల నేటికీ అక్కడక్కడా ఏటిగట్లు బలహీనంగానే ఉన్నాయి. గోదావరి నదికి మూడో ప్రమాద హెచ్చరిక వచ్చిందంటే ఎక్కడ ఏ గట్టు తెగుతుందోననే భయం వెంటాడుతూనే ఉంది. దీనికి తోడు ఎక్కడికక్కడ సాగునీటి, డ్రెయిన్లలో పూడిక పెరిగిపోయింది. దీంతో వరదల సమయంలో పొలాలన్నీ ఎగదన్ని ముంపునకు గురయ్యే దుస్థితి దాపురిస్తోంది. ప్రతీ వేసవిలోనూ డెల్టా కాలువలను పూడిక తీసే ప్రక్రియ చేపడుతుంటారు. కానీ ఇదంతా తూతూ మంత్రంగానే సాగుతుంది. దీంతో ఎక్కడి సమస్య అక్కడే తిష్ట వేస్తోంది. డెల్టా ఆధునికీకరణ పనులకు ప్రభుత్వం సుమారు రూ.1650 కోట్లు కేటాయించింది. ఈ నిధులతో పనులు చేపట్టారు. దాదాపు దశాబ్ధంన్నర కాలంగా ఈ పనులు జరుగుతూనే వున్నాయి. ఇంకా కొలిక్కి రాలేదు. ఏటికేడాది వేసవి కాలంలో చేపడుతున్న ఆధునీకీకరణ పనులు నిర్ధేశిత రీతిలో పూర్తి కాక ఆ మరుసటి ఏడాదికి మళ్లీ మొదటికొస్తున్నాయి. దీంతో రూ. కోట్ల నిధులు నీటి పాలు తప్ప ఎటువంటి ప్రయోజనం కనిపించడం లేదు. ఏళ్ల తరబడి జరుగుతున్న ఆధునికీకరణ పనులు రైతులకు ఇంకా అక్కరకు రాలేదు. గోదావరి డెల్టా సిస్టమ్‌లో తూర్పు డెల్టా కాలువల పొడవు 254 కిలో మీటర్లు, సెంట్రల్ డెల్టా కాలువ పొడవు 199 కిలో మీటర్లు, పశ్చిమ డెల్టాలో 11 ప్రధాన కాలువ పొడవు 563 కిలో మీటర్లు ఇవన్నీ ఎప్పటికపుడు పూడిక తీస్తూ సాగునీటిని సక్రమంగా అందించాల్సి ఉంది. పూడిక తీయకపోతే మాత్రం వరదల సమయంలో పొలాలను ముంచెత్తి రూ. కోట్ల విలువైన పంటను రైతులు మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి దాపురించింది. గోదావరి వరద ఈ సీజన్‌లో 17వ తేదీన మొదటి ప్రమాద హెచ్చరిక దశకు చేరి అక్కడ నుంచి మూడో ప్రమాద హెచ్చరిక సమీపం వరకు అంటే 15.35 అడుగుల వరకు వచ్చి అక్కడ నుంచి తగ్గుముఖం పట్టింది. అంతకు మించి ప్రమాద స్థాయికి వచ్చి ఉంటే చాలా చోట్ల బలహీనంగా ఉన్న ఏటిగట్ల పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఉత్పన్నం కాకమానదు. గోదావరి నదికి 1953 నుంచి వరుసగా మధ్యలో 1954 తప్ప 1959 వరకు మూడో ప్రమాద హెచ్చరికస్థాయిలో అంటే 17.75 అడుగులకు మించి ప్రవహించింది. 1986 ఆగస్టు 16న అత్యంత ప్రమాదకర స్థితిలో వరద ఉప్పెనై వచ్చింది. ఆ రోజు బ్యారేజి వద్ద ఉదయం ఆరు గంటలకు 24 లక్షల క్యూసెక్కుల వరద జలాలు సముద్రంలోకి వెళ్ళాయి. అంతకు ముందు రోజు అంటే 1986 ఆగస్టు 15న 16.80 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. ఆ తర్వాత 1994, 2010, 2000లలో మూడో ప్రమాద హెచ్చరిక దాటి ప్రమాదస్థాయిలో ప్రవహించింది. తాజాగా పరిశీలిస్తే సమీప కాలంలో 2013లో 19 లక్షల క్యూసెక్కుల వరద నీటితో మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి మించి వరద వచ్చింది. వరద చరిత్రను బట్టి గోదావరి నది పట్ల అప్రమత్త చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.