రాష్ట్రీయం

వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 25: వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ను ఆనుకుని అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ వాతావరం కేంద్రం అధికారులు శనివారం రాత్రి తెలిపారు. ఇది రాగల 48 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉందన్నారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. అల్పపీడనానికి అనుబంధంగా తమిళనాడు, రాయలసీమ జిల్లాలను ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని తెలిపారు. దీని ప్రభావంతో దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాలో వర్షాలు కురుస్తాయని చెప్పారు. అల్పపీడన ప్రభావంతో తీరం వెంబడి పశ్చిమ దిశగా గంటకు 45 నుంచి 50 కి మీ వేగంతో గాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు.