రాష్ట్రీయం

సాగర్‌లో కృష్ణమ్మ పైపైకి..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, ఆగస్టు 25: శ్రీశైలం నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ నాగార్జున సాగర్‌కు చేరుతుండగా సాగర్ జలాశయం నీటి మట్టం శనివారం రాత్రికల్లా 571 అడుగులకు, 259 టీఎంసీలకు చేరింది. సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు, 312 టీఎంసీలు. శ్రీశైలం నుంచి శనివారం రెండు గేట్లు ఎత్తి సాగర్‌కు 1లక్ష 28,493 క్యూసెక్కుల నీటిని వదిలారు. సాగర్ నుంచి కుడి కాలువకు 4940 క్యూసెక్కులు, ఎడమ కాలువకు 809 క్యూసెక్కులు, ఎస్‌ఎల్‌బీసీకి 1800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ ప్రాజెక్టుల నుంచి ఇన్‌ఫ్లో 1లక్ష 20,133 క్యూసెక్కులు కొనసాగగా, ప్రాజెక్టు నీటి మట్టం 883.10 అడుగులు, 205.25 టీఎంసీలుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు, 215టిఎంసిలు. శ్రీశైలంకు ఎగువ ప్రాజెక్టుల నుంచి నిలకడగా వస్తున్న వరద ఉద్ధృతి ప్రాజెక్టుగా నిండుగా ఉన్నందునా దిగువకు సాగర్‌కు వదులుతుండటంతో నాగార్జున సాగర్ జలాశయం సైతం పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరువ అవుతోంది. కాగా శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టుకు వస్తున్న ఇన్‌ఫ్లో, నీటి నిల్వలను సమీక్షించిన నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శనివారం హైద్రాబాద్‌లో తెలంగాణ గిడ్డంగుల సంస్థ వజ్రోత్సవాల్లో మాట్లాడుతూ మూడు రోజుల్లో సాగర్ గేట్ల నుంచి దిగువకు నీటి విడుదల చేస్తాని ప్రకటించారు. అటు రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నరసింహారెడ్డి ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చి సాగర్ జలాశయం నీటి మట్టంను పరిశీలించారు.

చిత్రం..నాగార్జున సాగర్‌లో 571 అడుగులకు చేరిన నీటి మట్టం