ఆంధ్రప్రదేశ్‌

ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా విమ్స్ ఆస్పత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విమ్స్ ఆస్పత్రిని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పరిధిలోకి తీసుకువచ్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌గా అభివృద్ధి చేస్తామని ఆరోగ్య, వైద్య మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ చెప్పారు. బుధవారం నాడు శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో కిడారి సర్వేశ్వరరావు, విష్ణుకుమార్‌రాజు, రాజన్నదొర, రామకృష్ణబాబు, కళావతి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. సర్వేశ్వరరావు మాట్లాడుతూ ఆస్పత్రి ఎప్పుడు ప్రారంభిస్తారో స్పష్టం చేయాలని అన్నారు. విమ్స్‌ను ప్రైవేటీకరించే ఆలోచన లేదని మంత్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. విమ్స్ ఆస్పత్రి పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రతిపాదించిందని, ఏప్రిల్ 6వ తేదీన ఒపి ప్రారంభిస్తామని అన్నారు. ఆక్సిజన్ పైప్‌లైన్ కోసం వర్కు ఆర్డర్ జారీ చేశామని, హుద్‌హుద్ నష్టాలు, ఇతర వౌలిక సదుపాయాల మరమ్మతు పనులు పురోగతిలో ఉన్నాయని, పనులు సిబ్బంది నియామకం పూర్తయిన తర్వాత ఆస్పత్రిని నిర్వహణలోకి తీసుకువస్తామని పేర్కొన్నారు.
రోడ్లు వేయడానికి అంచనాలు
రోడ్లు వేయడానికి కొండ ప్రాంతాల్లోని గట్టి నేలలు, డెల్టా ప్రాంతాల్లోని తేలికపాటి నేలలకు ఒకే రకమైన అంచనాలు ఉండవని, నేలల రకం, రాకపోకల రద్దీ ఆధారంగా కాలిబాటలను డిజైన్ చేయడం ద్వారా ఒక ప్రత్యేక రోడ్డుకు సంబంధించిన ఉపరితల ఆవశ్యకతను అంచనా వేస్తామని రోడ్లు భవనాల మంత్రి సిద్ధా రాఘవరావు చెప్పారు. అయితాబత్తుల ఆనందరావు, ఆకుల సత్యనారాయణ, ఆంజనేయులు, గొల్లపల్లి సూర్యారావు తదితర శాసనసభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి బదులిస్తూ, తేలిక పాటి నేలలు లేదా గట్టి నేలల్లో రోడ్లు ఏవైనా కనీసం 10 ఏళ్ల పాటు మన్నిక కలిగి ఉండటానికి నేల రకం ఆధారంగా రోడ్లు ఉపరితలాన్ని డిజైన్ చేస్తామని అన్నారు. అయినా క్షేత్ర పరిస్థితి ఆధారంగా, ప్రాధాన్యతా ప్రాతిపదికన ఐదేళ్ల కాలం తర్వాత పునరుద్ధరణలు చేపట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. తేలిక పాటి నేలల విషయంలో రోడ్లు వేసిన తర్వాత పదేళ్ల కాలం పాటు సురక్షితంగా ఉండేలా చూడటానికి రూపొందించిన ఉపరితలానికి అదనంగా 500 మిల్లీమీటర్లు మందం ఉన్న సబ్ గ్రేడ్‌ను సమకూరుస్తున్నామని అన్నారు. అంతకు ముందు ఆనందరావు మాట్లాడుతూ తేలికపాటి నేలలకు ప్రత్యేక అంచనాలు లేకపోవడం వల్ల రోడ్లు తొందరగా పాడవుతున్నాయని అన్నారు.

ఏనుగుల దాడిలో వెయ్యి ఎకరాల పంట ధ్వంసం
అటవీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, మార్చి 9: ఏనుగుల దాడి వల్ల 2014-15, 2015-16 సంవత్సరాల్లో దాదాపు వెయ్యి ఎకరాల పంట ధ్వంసం అయిందని వారందరికీ పరిహారం చెల్లించడం జరుగుతుందని అటవీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎస్ అమరనాధ్‌రెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు. చిత్తూరు జిల్లాలో 14-15 సంవత్సరంలో 585.74 ఎకరాలు, 15-16లో 402.39 ఎకరాలు పంట ధ్వంసం అయిందని, కడపలో 0.852 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లాలో 14-15లో 23.61 ఎకరాలు, 15-16లో 55.72 ఎకరాలు పంట ధ్వంసం అయిందని చెప్పారు.