రాష్ట్రీయం

చిత్తయన అవిశ్వాసం ఎత్తు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై వేర్వేరుగా అవిశ్వాస తీర్మానాలు ఇచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిందన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం రాష్ట్ర ప్రభుత్వంపై చేపట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోవడంతో ఏకంగా స్పీకర్ కోడెల శివప్రసాద్‌పైనే మంగళవారం అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టారు.తీర్మానాలు చర్చకు వచ్చినా, వైకాపా ‘విప్’ జారీ చేసినా, టిడిపిలో చేరిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు సునాయసంగా తప్పించుకున్నారు. ప్రభుత్వంపై ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ నిర్వహించకుండా మూజువాణి ఓటుతో తీర్మానం వీగిపోయిందని స్పీకర్ ప్రకటించడంతో జగన్ వ్యూహం ఫలించలేదు. స్పీకర్‌పై ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ జరిగినా, ఆ ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. టిడిపిలో చేరిన వైకాపా ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, ఆది నారాయణ రెడ్డి, బి.జయరాములు, కలమట వెంకటరమణ, మణి గాంధీ, జలీల్‌ఖాన్, డేవిడ్ రాజు, నవోదయ పార్టీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ గైర్హాజరయ్యారు. వైకాపా ఎమ్మెల్యే ఆర్‌కె రోజా సస్పెన్షన్‌లో ఉండడం వల్ల హాజరుకాలేదు. మరో ఎమ్మెల్యే అనిల్ కూడా హాజరుకాలేదు.
ఈ తీర్మానాల ద్వారా ప్రభుత్వాన్ని, స్పీకర్‌ను నిలదీయవచ్చని జగన్ భావించారు. మరోవైపు తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు టిడిపిలో చేరినందున, ‘విప్’ జారీ చేసి వారిని నిండు సభలోనే పట్టుకోవచ్చునన్న ఆయన వ్యూహం కూడా తలకిందులైంది. అవిశ్వాస తీర్మానం నోటీసుకు అనుకూలంగా జగన్ పార్టీ ఎమ్మెల్యేల బలం ఉండడంతో, తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాలని జగన్ పార్టీ ‘విప్’ జారీ చేసేంత గడువు కూడా ఇవ్వకుండా, వెంటనే చర్చకు ప్రభుత్వం అనుమతించడంతో ఏమి చేయాలో తోచని పరిస్థితి ఎదురైంది. మంగళవారం స్పీకర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వగానే, ప్రభుత్వం వెనువెంటనే చర్చకు అనుమతించడంతో, వైకాపా హడావుడిగా టిడిపిలో చేరిన తమ పార్టీ ఎనిమిది మంది ఎమ్మెల్యేలకూ ‘విప్’ జారీ చేసింది. ఇలాఉండగా స్పీకర్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జరిగే సమయానికి సదరు ఎనిమిది మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ మొబైల్స్‌ను స్విచ్ ఆఫ్ చేసి ఓటింగ్‌కు గైర్హాజరయ్యారు. కాబట్టి ఆ ఎమ్మెల్యేలు తమకు విప్ అందలేదని చెప్పేందుకు అవకాశం ఏర్పడింది. జగన్ వ్యూహాన్ని ఎక్కడికక్కడ పాలక పక్షం ప్రతివ్యూహంతో ఎదుర్కొంది.
జగన్‌లో ఆవేశం కట్టలు తెంచుకుంటున్నా, ఆలోచనతో అడుగులు వేయడం లేదనేది స్పష్టమయ్యింది. పాలక పక్షానికి మెజారిటీ ఉన్నా, తన చాతుర్యంతో, అసెంబ్లీ రూల్స్, పార్లమెంటరీ సంప్రదాయాల (కౌల్ అండ్ షక్దర్)ను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి ఉంటే ‘శభాష్’ అనిపించుకునే వారు. మరోవైపు అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ‘్ధటి’కి జగన్‌గానీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు గానీ గట్టిగా నిలబడలేకపోయారు. చర్చ ఆరంభం నుంచే జగన్‌కు ఎదురుదాడి తప్పలేదు. అవిశ్వాస తీర్మానంపై ప్రసంగించేందుకు జగన్ ఉద్యుక్తం కాగానే మంత్రి యనమల అడ్డుపడ్డారు. జగన్ అవిశ్వాస తీర్మానం ఇవ్వలేదని, పైగా ఆ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపైనా జగన్ సంతకం చేయలేదు కాబట్టి ఆయన్ని మాట్లాడనీయరాదని కౌల్ అండ్ షక్దర్‌ను ప్రస్తావించారు. అవిశ్వాస తీర్మానంపై ఎవరైనా మాట్లాడవచ్చు అంటూ జగన్ చెప్పినా, యనమల కల్పించుకుని, మాట్లాడవచ్చు కానీ చర్చను ప్రారంభించేందుకు వీలులేదని చెప్పడంతో, చివరకు వైకాపా పక్షం ఉప నాయకుడు జ్యోతుల నెహ్రూ చర్చను ప్రారంభించారు.
రెండో రోజూ జగన్ అదే తప్పు చేశారు. స్పీకర్ కోడెలపై ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపైనా సంతకం చేయలేదు. సంతకం చేసేందుకు జగన్ ఎందుకు వెనకాడారని ప్రశ్నించేందుకు పాలకపక్షానికి అవకాశం ఇచ్చినట్లు అయ్యింది. పైగా అసెంబ్లీ రూల్స్ గురించి, కౌల్ అండ్ షక్దర్ సంప్రదాయాల గురించి వైకాపా ఎమ్మెల్యేలలో సంపూర్ణ అవగాహన కనిపించడం లేదు. అందుకే అడుగడుగునా ఎదురుదాడికి గురయ్యారు. దీనిని తట్టుకునేందుకు వారికి స్పీకర్ పోడియం వద్దకు వెళ్ళి నినాదాలు చేయడం మినహా మరో మార్గం కనిపించలేదు. జగన్ చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందిస్తూ వాటిని నిరూపిస్తే ఆ ఇద్దరు మంత్రులు నారాయణ, రవీంద్రను మంత్రివర్గం నుంచి తప్పిస్తానని చెప్పారు. కానీ జగన్ అదేమీ పట్టించుకోకుండా సిబిఐ విచారణకు ప్రభుత్వం ఎందుకు వెనకాడుతున్నదని ప్రశ్నించారు. చంద్రబాబు వ్యవస్థలను మేనేజ్ చేసుకుని కేసుల నుంచి తప్పించుకున్నారని జగన్ ఆరోపించి, ఎదురుదాడికి గురయ్యారు. జగన్ న్యాయ వ్యవస్థను కించపరిచారని, ఆయన సభకు, న్యాయమూర్తులకు క్షమాపణ చెప్పాలని పాలక పక్షం సభ్యులు పట్టుబట్టారు. మంత్రి యనమల అంతటితో ఆగకుండా జగన్ ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిలుచుంటున్నారని విమర్శించారు. ఇలా రెండు రోజుల పాటు జరిగిన చర్చ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనుకున్న వైకాపా వ్యూహం ఫలించలేదు. అయితే ప్రభుత్వాన్ని, ఏకపక్షంగా వ్యవహారిస్తున్న స్పీకర్‌ను విమర్శించగలిగామన్న సంతృప్తిని వైకాపా వ్యక్తం చేస్తోంది.