రాష్ట్రీయం

ఏడాదికి 3 సిలిండర్లు ఉచితం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు: ప్రజల్ని ఆకట్టుకునే రీతిలో ఎన్నికల హామీలు ప్రకటించడంలో మిగతా రాజకీయ పక్షాల కంటే కాంగ్రెస్ పార్టీ ముందుంది. రానున్న ఎన్నికల్లో గెలిస్తే ప్రజలకు ఇచ్చే వరాలను ప్రకటించడమే కాకుండా ఈనెల 18న పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను పురస్కరించుకుని ఎన్నికల శంఖారావం చేయనుంది. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న హామీల్లో రైతులకు రూ. 2 లక్షలు ఒకే దఫా రుణమాఫీ, పొదుపు మహిళలకు వడ్డీ లేని రుణాలు, 35 ఏళ్ల లోపు యువతకు ఆదాయపన్నులో మినహాయింపు మొదలైనవి ఉన్న విషయం
తెలిసిందే. తాజాగా ఆ పార్టీ హామీల్లో ఏడాదికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని కరపత్రాలు
పంచుతున్నారు. మైనారిటీలకు 4 నుంచి 8 శాతం వరకూ రిజర్వేషన్లు ఇస్తామని కూడా స్పష్టం చేస్తోంది. ఇక జాతీయ ప్రాజెక్టు పోలవరం, రాష్ట్ర కొత్త రాజధాని నిర్మాణానికి అవసరమైన నిధులు సమకూర్చుతామని ప్రజలకు వివరిస్తోంది. టీడీపీ ప్రభుత్వం ప్రకటించిన నిరుద్యోగ భృతి రూ. వెయ్యిని రూ.3 వేలకు పెంచుతామని, అలాగే పింఛన్లు రూ. 2 వేలకు పెంచుతామని ప్రజలకు చెబుతోంది. దేశ వ్యాప్తంగా ఇబ్బందిగా మారిన జీఎస్‌టీ విధానాన్ని సమీక్షించి సరళీకృతం చేస్తామనీ హామీ ఇస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రైల్వే జోన్, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక నిధులు, కడపలో ఉక్కు పరిశ్రమ, దుగరాజుపట్నంలో ఓడరేవు ఏర్పాటు చేసి తీరుతామని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి కల్పన అవకాశాలను మరింత మెరుగుపరచడం, దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వడం తమ ప్రాధాన్యతాంశంగా స్పష్టం చేస్తోంది. వీటన్నింటినీ కాంగ్రెస్ ఎన్నికల ప్రణాళికలో అధికారికంగా చేర్చి అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఆ పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. పొరుగు రాష్టమ్రైన తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు అక్కడి ప్రభుత్వం సిద్ధమై కార్యాచరణకు దిగడంతో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు సన్నద్ధమైంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి విస్తృతంగా ఏర్పాట్లు చేసుకుంటోంది. రాష్ట్రంలో అధికార టీడీపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎదుర్కొంటుండటం, ప్రతిపక్ష వైసీపీ బలపడకపోవడంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మోసం చేసిందన్న భావన రాష్ట్ర ప్రజల్లో ఉందని కాంగ్రెస్ నేతలంటున్నారు. కాంగ్రెస్ బలపడేందుకు ఇదే సరైన సమయమని పార్టీ నేతలు ప్రయత్నాలను రెట్టింపు చేశారు. ఈనెల 18వ తేదీ రాహుల్ గాంధీ పర్యటన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరింత ఉత్సాహంగా పనిచేయడం ఖాయమని కేంద్ర, రాష్ట్రాల్లో అధికారంలోకి రావడం తథ్యమని పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్‌రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు.