రాష్ట్రీయం

రైతులకు అన్నివిధాల భరోసా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం (జగదాంబ), సెప్టెంబర్ 6: వైసీపీ అధికారంలోకి వస్తే రైతాంగం సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. ప్రజా సంకల్పయాత్ర 256వ రోజు విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని అమృతపురంలో గురువారం కొనసాగింది. ఈ సందర్భంగా జగన్ ప్రజలకు అభివాదం చేస్తూ, రైతులు, స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా సబ్బవరం వద్ద ట్రై జంక్షన్ శాటిలైట్ టౌన్‌షిప్ పేరుతో ప్రభుత్వం విలువైన 1,570 ఎకరాల భూమిని సేకరిస్తోందని, ఏటా మూడు పంటలు పండే భూములను అన్యాయంగా లాక్కుంటోందని, కనీసం నష్టపరిహరం కూడా ఇవ్వడం లేదన్నారు. అన్నివిధాలా నష్టపోతున్న తమకు తగిన న్యాయం చేయాలని రైతులంతా జగన్‌తో మొరపెట్టుకున్నారు. జగన్ పాదయాత్రలో పాల్గొన్న వారందరితో ముచ్చటిస్తూ
ప్రతీ ఒక్కరిలో భరోసా కల్పించారు. మహిళలు, విద్యార్థులు, పిల్లలు జగన్‌తో సెల్పీ కోసం పోటీ పడ్డారు. వైసీపీ అధికారంలోకి వస్తే రైతులకు ఎటువంటి కష్టం లేకుండా ప్రత్యేక పథకాలను ఏర్పాటు చేస్తానని ఈ సందర్భంగా జగన్ ప్రకటించారు. పాదయాత్రలో కళాశాల విద్యార్థులు తమ సమస్యలను తెలుపుతూ నిరుద్యోగులకు ప్రభుత్వం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే ప్రత్యేకహోదా కావాలని నినాదాలు చేశారు. ఈసందర్భంగా పలువరు నాయకులు, కార్యకర్తలు పార్టీలో చేరారు. పాదయాత్రలో వైసీపీ జిల్లా నాయకులు గుడివాడ అమర్‌నాథ్, వరదు కళ్యాణి, అదీప్‌రాజు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

చిత్రం..డప్పు వాయిద్యాలతో జగన్‌కు స్వాగతం