రాష్ట్రీయం

అక్టోబర్‌లో నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: శాసనసభకు నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలిపారు. శాసనసభను రద్దు చేయడం వల్ల డిసెంబర్‌లో జరుగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటే జరుగుతాయా లేదానన్న అనుమానాలకు తావే లేదన్నారు. శాసనసభ రద్దు తర్వాత తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ, ఈ అంశంపై ఎన్నికల కమిషన్‌తో తానే స్వయంగా మాట్లాడినట్టు చెప్పారు. అలాగే ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ కూడా ఎన్నికల కమిషన్‌తో చర్చించారన్నారు. శాసనసభ రద్దు చేసిన సమాచారం ఎన్నికల కమిషన్‌కు చేరగానే మిగతా రాష్ట్రాలతోపాటు తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు కూడా అక్టోబర్‌లో నోటిఫికేషన్ విడుదల అవుతుందన్నారు. నవంబర్‌లో ఎన్నికలు, డిసెంబర్‌లో ఫలితాలు వస్తాయని వివరించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయనే విషయంలో రకరకాల ఉహాగానాలున్నాయని.. ఈ విషయంలో ఎలాంటి గదంరగోళం లేదు. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలను వీలైనంత త్వరగా నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పులు అనేకం ఉన్నాయ. తనకున్న పరిజ్ఞానం మేరకు అక్టోబర్‌లో ప్రక్రియ ప్రారంభమై డిసెంబర్‌లో ముగుస్తుందని కేసీఆర్ వివరించారు.