రాష్ట్రీయం

పాలించలేకే అసెంబ్లీ రద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 6: రానున్న కాలంలో పరిపాలన కొనసాగించలేమన్న అభద్రతా భావంతోనే కేసీఆర్ తొమ్మిది నెలల ముందుగానే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇ పెద్దిరెడ్డి విమర్శించారు. జాతకాల పిచ్చితో జ్యోతిష్యులు చెప్పిన విధంగా నాలుగు సంవత్సరాల మూడు నెలల మూడు రోజులకు తన రాజ్యాధికారానికి కేసీఆర్ స్వస్తి పలికారని, అబద్దాల పాలన నుంచి ఎప్పుడు బయటపడదామా అని ప్రజలు భావిస్తున్న తరుణంలో ముందస్తుకు వెళ్లడం ప్రజల విజయమని అభివర్ణించారు. శ్రావణ ఏకాదశి పర్వదినాన గురువారం దుర్గమ్మను దర్శించుకున్న పెద్దిరెడ్డి.. తెలంగాణ అసెంబ్లీని రద్దు చేస్తూ కేసీఆర్ నిర్ణయం తీసుకున్న మీదట తాజా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చర్చించిన అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు. 9 నెలలు ముందే ప్రభుత్వాన్ని రద్దు చేయడం వలన ఏడాదిపాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కుంటుపడే అవకాశముందని అన్నారు. పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ఐదు సంవత్సరాలపాటు పాలన కొనసాగించలేని కేసీఆర్ నవంబర్‌లో రైతులకు రెండో విడత నిధులు ఇవ్వాల్సి రావడం, పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేకపోవడం, ఆర్థిక మాంద్యం కారణంగా ఉద్యోగులకు జీతాలు చెల్లించలేమేమోనన్న భయంతో ప్రభుత్వాన్ని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. తాజా రాజకీయ పరిస్థితులను సమీక్షించేందుకు ఈ నెల 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య శ్రేణులతో హైదరాబాద్‌లో కీలక భేటీ నిర్వహించనున్నారని అన్నారు. ఆ రోజు మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు సుదీర్ఘంగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు చెప్పారు.

చిత్రం.. ఏపీ అసెంబ్లీ వద్ద మీడియా పాయింట్‌లో మాట్లాడుతున్న టీడీపీ నేత పెద్దిరెడ్డి