రాష్ట్రీయం

ఒంటరిగానే పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కూడా తమకు పొత్తులు ఉండదని టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు స్పష్టం చేసారు. టీఆర్‌ఎస్ ఒంటరిగానే పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ పొత్తులపై స్పష్టత ఇచ్చారు. ఎంఐఎం తమకు మిత్రపక్షమన్నారు. వందకు వందశాతం టీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీ భవిష్యత్‌లో కూడా సెక్యులర్‌గానే ఉంటామన్నారు. ఎంఐఎంతో పొత్తున్న పార్టీతో తమకు పొత్తు ఎలా ఉంటుందని బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా అనే అన్నప్పుడు ఆ పార్టీతో తమకు పొత్తు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తమతో పొత్తు పెట్టుకుంటామని బీజేపీ తమనేమి అడుగలేదన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు ఉంటుందా? అనేది ఇప్పుడెలా చెబుతామని కేసీఆర్ ఎదురు ప్రశ్నించారు. బీజేపీ నేతలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారన్నారు. వారికి తెలంగాణలో ఎంత బలం ఉందో తెలియదా అని కేసీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీతో పొత్తు పెట్టుకుంటే అంతకంటే దౌర్బగ్యం లేదన్నారు. కాంగ్రెస్-టీడీపీల మధ్య పొత్తు ఉంటే అది అసహ్యకరం, జుగుస్సాకరమని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో నిర్మించే ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుతగులుతోన్న ఆంధ్రపార్టీ టీడీపీతో కాంగ్రెస్ పొత్తు ఎలా పెట్టుకుంటుందని ప్రశ్నించారు. తెలంగాణ మళ్లీ ఆంధ్ర పార్టీలకు గులాం కావద్దన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై స్పందిస్తూ తాము ప్రతిపాదించిన థర్డ్ ఫ్రంట్ అద్భుతంగా నిలబడుతుందన్నారు. పక్క రాష్ట్రం ఆయనలాగా (చంద్రబాబు) తమది చక్రం తిప్పే ఫ్రంట్ కాదనీ, ప్రజల కోసం పెట్టే ఫ్రంట్ అని కేసీఆర్ స్పష్టం చేసారు. తమ పార్టీ వందకు పైగా సీట్లు గెలుచుకుంటుందన్నారు. 82 నియోజకవర్గాల్లో 60 శాతంపైనా, 100 స్థానాల్లో 50 శాతం పైనా ఓట్లు వస్తాయన్నారు. ప్రతిపక్షాలన్నీ ఏకమైనా వందకుపైగా స్థానాలు గెలుచుకోబోతున్నామని కేసీఆర్ ధీమా వ్యక్తం చేసారు.