రాష్ట్రీయం

దుర్గమ్మకు రెండు పసిడి హారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి) సెప్టెంబర్ 6: ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీకనకదుర్గమ్మకు ఇద్దరు భక్తులు వేరు వేరుగా రెండు పసిడి హారాలను బహూకరించారు. ఈ రెండు హారాల తూకం 1కిలో 291 గ్రాములు ఉండగా వీటి విలువ 40 లక్షల రూపాయలు. గురువారం ఉదయం చెన్నైకు చెందిన వేణుశ్రీనివాస్ కిలో122గ్రాముల తూకంతో ప్రత్యేకంగా తయారు చేయించిన కమల హారాన్ని ఆలయ ఈవో వీ కోటేశ్వరమ్మకు అందజేశారు. ఈ హారంలో 108 పసిడి కమలలు ఉన్నాయి. ఈ హారం విలువ రూ. 35 లక్షలు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన వెంకట సుబ్రహ్మణ్య ప్రసాద్ 169 గ్రాముల తూకంతో తయారు చేయించిన గజలక్ష్మీ హారం బహూకరించారు. ఇందులో తెలుపు,పచ్చరాళ్లు పొదగబడి ఉన్నాయి. దీని విలువ 5లక్షల రూపాయలు. ఈ సందర్భంగా ఈవో ఆదేశాల మేరకు ఆలయ సిబ్బంది ఈ ఇద్దరు దాతలను అంతరాలయంలోనికి తీసుకువెళ్ళి ప్రత్యేక దర్శనం చేయించి ఆశీర్వాద మండపంలో అర్చకులచేత అమ్మవారి దివ్య అశీస్సులను ఇప్పించారు. ఈ దాతలకు అమ్మవారి శేష వస్త్రం, చిత్రపటం, ప్రత్యేక ప్రసాదాలను ఈవో అందచేశారు. మహోత్సవాల్లో అవసరాలను బట్టి దాతలు ఇచ్చిన ఈ రెండు హారాలను వినియోగిస్తామని ఈవో వివరించారు. ఈకార్యక్రమంలో దేవస్థానం ప్రధాన అర్చకుడు లింగంబొట్ల దుర్గా ప్రసాద్ పాల్గొన్నారు.