రాష్ట్రీయం

రాహుల్ పెద్ద బఫూన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 6: రాహుల్ గాంధీ దేశంలోనే అతి పెద్ద బఫూన్ అని సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. గురువారం నాడు ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ తెలంగాణకు నెంబర్ వన్ విలన్ కాంగ్రెస్ పార్టీయేనని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ పీడ విరగడకావడం ఖాయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌పై కేసీఆర్ విరుచుకుపడ్డారు. రాహుల్ ఏమిటో అందరికీ తెలుసని, లోక్‌సభలో నరేంద్ర మోదీ వద్దకు వెళ్లి ఆయనను హత్తుకోవడం, కన్నుకొట్టడం వంటి చర్యలను దేశమంతా చూసిందని అన్నారు. ఇక రాష్ట్రంలో రాహుల్ ప్రచారం గురించి స్పందిస్తూ, 3ఆయన మాకు పెద్ద ఆస్తి, ఆయన తెలంగాణలో ఎంత ఎక్కువగా పర్యటిస్తే అంత ఎక్కువగా సీట్లు గెలుచుకుంటాం2 అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
తెలంగాణ ప్రజలు ఢిల్లీకి గులాంలుగా మారొద్దని కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ నిర్ణయాలను స్థానికంగానే తీసుకోవాలని అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ నెంబర్ వన్ విలన్ అని 2001లోనే చెప్పానని గుర్తుచేశారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణను భిక్షమెయ్యలేదనీ, తెగించి కొట్లాడి తెచ్చుకున్నామనీ అన్నారు. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేసిందని దుయ్యబట్టారు. రైతులను మోసం చేసిందని, దరిద్రాలకు రిజర్వు బ్యాంకు కాంగ్రెస్ పార్టీనేనని అన్నారు. స్వరాష్ట్రంలో కల్తీలు లేవని, కుంభకోణాలు లేవని, కాంగ్రెస్ పార్టీ బాధ్యతా రాహిత్యంగా ఎన్నికల్లో హామీలు ఇస్తోందని, టీఆర్‌ఎస్ వల్లే కాంగ్రెస్ రెండు వేల రూపాయిలు పెన్షన్ ప్రకటించే పరిస్థితి వచ్చిందని అన్నారు.