రాష్ట్రీయం

నాలుగేళ్లలో పర్యాటక రంగంలో 14.62 మిలియన్ ఉద్యోగాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 6: పర్యాటక రంగంలో గడచిన నాలుగు సంవత్సరాల్లో 14.62 మిలియన్ల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్‌ఫోన్స్ తెలియచేశారు. 34వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేట్స్ (అయాటో) నాలుగు రోజుల సదస్సు గురువారం ఇక్కడ ప్రారంభమైంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన అల్‌ఫోన్స్ మాట్లాడుతూ టూర్ ఆపరేటర్లే ఇండియాకు నిజమైన అంబాసిడర్స్ అని అన్నారు. వారివలన దేశ నాగరికత, సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి తెలియచేగలుగుతున్నామని చెప్పారు. భారత దేశానికి వచ్చే పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అన్నారు. 2020 నాటికి 20 మిలియన్ల టూరిస్ట్‌లు దేశానికి వచ్చేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. టూర్ ఆపరేటర్స్, పర్యాటక శాఖ అధికారుల్లో కదలిక రావాలని, దేశ, విదేశాల్లో రోడ్ షోలు నిర్వహించాలని ఆయన సూచించారు. ప్రధాని నరేంద్ర మోదీకి వచ్చిన పలు ఆలోచనలు అనేక సమస్యలకు పరిష్కార మార్గాన్ని చూపాయని మంత్రి అల్‌ఫోన్స్ చెప్పారు. ఆయన ఆలోచన వలనే దేశంలో 85 మిలియన్ల టాయిలెట్లు నిర్మాణమయ్యాయని, 45 మిలియన్ల మందికి గ్యాస్ కనెక్షన్‌లు వచ్చాయన్నారు. పర్యాటకానికి అవకాశం ఉన్న ప్రతి గ్రామాన్ని, పట్టణాన్ని, నగరాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆయన సూచించారు. భారత దేశాన్ని ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి పర్యాటకం ఎంతగానో ఉపయోగపడుందని, ఆ దిశగా అధికారులు, టూర్ ఆపరేటర్లు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి 30 ఏళ్లకు ఓసారి చైనాను తుఫానులు ధ్వంసం చేస్తాయి. ఆ విలయాన్ని అవకాశంగా మలుచుకుని ఎప్పటికప్పుడు కొత్త నగరాలను నిర్మించుకుంటున్నారని మంత్రి చెప్పారు. షాంగై నిత్య నూతనంగా ఉండడానికి కారణం చైనీయుల్లోని పట్టుదల, కృషేనని చెప్పారు. దుబాయ్‌కు చైనా పర్యాటకులు పెద్ద సంఖ్యలో వెళుతున్నారు. ఇందుకు దుబాయ్ మార్కెట్టే కారణమని అన్నారు. ఇలాంటి సున్నితమైన అంశాలను పర్యాటక శాఖ అధికారులు పరిశీలించి, భారత దేశ అందాలను ప్రపంచ దేశాలకు చూపించాలని అన్నారు. భారీ వరదలతో కేరళ ఛిన్నాభిన్నమైంది. అనేక గ్రామాలు నేలమట్టమయ్యాయి. కానీ దేశమంతా ఒక్కటై కేరళకు అందించిన సహాయ సహకారాలను, ఐక్యతా బలంతో కొత్త కేరళను నిర్మించాలని అన్నారు. కేరళలో పర్యాటక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. ఆ ప్రాంతాలనే మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఆయన కేరళ పర్యాటక శాఖ మంత్రి సురేంద్రన్‌కు సూచించారు.
కేరళ పర్యాటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మాట్లాడుతూ కేరళకు పర్యాటక రంగం వెనె్నముక వంటిదని అన్నారు. వరదలకు దెబ్బతిన్న కేరళ తేరుకుందని అన్నారు. విమాన సర్వీసులు, హోటల్స్ యథావిధిగా పనిచేస్తున్నాయని చెప్పారు. కేరళ టూరిజం మార్క్‌ను ఈనెల 27న నిర్వహించేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని ఆయన తెలియచేశారు. కొత్త ప్రణాళికలు, కొత్త ఆలోచనలతో కేరళ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వచ్చే మూడు సంవత్సరాలూ అయిటో సదస్సులు కేరళలోనే నిర్వహించాలని మంత్రి సురేంద్రన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అఖిలప్రియ మాట్లాడుతూ పర్యాటక రంగ అభివృద్ధికి 412 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ఈ రంగంలో 15,269 కోట్ల విలువైన 96 ఎంఓయూలు కుదుర్చుకున్నామని, వీటిలో 50 శాతం ప్రాజెక్ట్‌లు ఈ సంవత్సరాంతానికి అందుబాటులోకి రానున్నాయని అన్నారు. అయాటో ప్రతి సంవత్సరం ఓ పారిశ్రామికవేత్తను సత్కరిస్తుంటుంది. ఈ సంవత్సరం అజీత్ బజాజ్‌ను సత్కరించింది. ఈ కార్యక్రమంలో ఏపీటీడీఏ సీఈఓ హిమాంశు శుక్లా, అయాటో అధ్యక్షుడు ప్రణబ్ సర్కార్, కేంద్ర పర్యాటకశాఖ కార్యదర్శి రష్మివర్మ, రాష్ట్ర పర్యాటకశాఖ కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి అల్‌ఫోన్స్