రాష్ట్రీయం

కారెక్కనున్న సురేశ్ రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 7: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్ పార్టీలో చేరికకు రంగం సిద్ధమైంది. ఈ నెల 12న టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన గులాబీ కండువ కప్పుకోనున్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్ తాజా ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డితో కలిసి ఆపద్ధర్మ మంత్రి కేటీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లో సురేశ్ రెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. టీఆర్‌ఎస్‌లో చేరాల్సిందిగా కేటీఆర్ కోరగానే సురేశ్ రెడ్డి అంగీకరించారు. ఈ నెల 12న పార్టీ అధినేత కేసీఆర్ సమక్షంలో సురేశ్ రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. తెలంగాణలో ప్రస్తుతం నిశబ్ద అభివృద్ధి విప్లవం కొనసాగుతుండటంతో రాజకీయంగా కాకుండా రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు ఈ సందర్భంగా సురేశ్ రెడ్డి మీడియాకు తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాను కేసీఆర్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిసి పని చేసిన సంబంధాలున్నాయని చెప్పారు. మూడు తరాలుగా తమ కుటుంబం కాంగ్రెస్‌లోనే ఉన్నప్పటికీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసమే టీఆర్‌ఎస్‌లో చేరాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు.