రాష్ట్రీయం

దూకుడే....దూకుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* అన్ని పార్టీల్లోనూ హడావిడి అస్తశ్రస్త్రాలు సిద్ధం చేస్తున్న నేతలు
* శంఖారావం పూరించిన కేసీఆర్ పీసీసీ నేతల అత్యవసర సమావేశం
* పొత్తుల కోసం ఐదుగురితో కమిటీ నేడు టీ.టీడీపీ నేతలతో బాబు భేటీ
* పొత్తులు, అభ్యర్థులపై చర్చ పొత్తులపై బాబు-ఉత్తమ్ చర్చిస్తారా?
* 15లోగా బీజేపీ అభ్యర్థుల ఖరారు

వీరన్నగారి ఈశ్వర్ రెడ్డి
---------------------------]

హైదరాబాద్, సెప్టెంబర్ 7: రాష్ట్ర అసెంబ్లీ రద్దు కావడంతో అన్ని పార్టీల్లోనూ ఒక్కసారి హడావిడి ప్రారంభమైంది. రాజకీయ వేడి పెరిగింది. ఫిరాయింపులు, పరస్పర ఆరోపణలు మొదలయ్యాయి. అప్రమత్తమైన ప్రతిపక్షాల నేతలు అస్తశ్రస్త్రాలు బయటకు తీసి పదును పెడుతున్నారు. విపక్షాలు తేరుకోక ముందే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు శుక్రవారం హుస్నాబాద్ వేదిక నుంచి ఎన్నికల ‘శంఖారావం’ పూరించారు. మలి విడతగా 50 రోజుల్లో వంద నియోజకవర్గాల్లో బహిరంగ సభలు నిర్వహిస్తూ పార్టీ నేతలను, కార్యకర్తలను పరుగులు పెట్టించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇంతకాలం ఫాం హౌస్‌లో కేసీఆర్ ‘రిలాక్స్’ అవుతున్నారని భావించిన విపక్షాలు ఆయన దూకుడుతో బోల్తాపడ్డాయి. అంతేగాక ఎన్నికలకు ఇంకా చాలా గడువు ఉందని ప్రతిపక్షాలు ఏమరుపాటుగా ఉన్న సమయంలోనే కేసీఆర్ లెక్కలు వేసుకుని, ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందస్తు యుద్ధంలోకి దూకారు. దీంతో విపక్షాలు బిత్తరపోవాల్సి వచ్చింది.

ఉత్తమ్ అధ్యక్షతన..
ఇలాఉండగా గాంధీ భవన్‌లో పీసీసీ కార్యవర్గం అత్యవసరంగా సమావేశమైంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి ఆర్‌సీ కుంతియా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇంకా సీనియర్ నాయకులు కే. జానారెడ్డి, మహ్మద్ షబ్బీర్ అలీ, వీ. హనుమంత రావు, డీకే అరుణ ప్రభృతులు సమావేశమై చర్చించారు. కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించి, ప్రచారం చేయడం ప్రారంభించడంపై వారు చర్చించారు. ఇక ఏ మాత్రం జాప్యం చేయరాదని, తామూ ఎన్నికల శంఖారావం పూరించాలని నిర్ణయించారు. ఈ నెల 10న భారీ బహిరంగ సభ నిర్వహించి సోనియా గాంధీని ఆహ్వానించాలని తీర్మానించారు. మలి విడత ప్రచారానికి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని ఆహ్వానించాలని భావించారు. అయితే, ఎన్నికల ప్రచారానికి తొలి విడత బహిరంగ సభను తమ నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలంటూ కొంత మంది పట్టుబట్టారు. కాగా చేవెళ్ళ సెంటిమెంట్‌గా అక్కడి నుంచి ప్రారంభించాలా? అనే అంశంపైనా చర్చ జరిగింది. ఏదైనా ఉత్తమ్, కుంతియా కలిసి దీనిపై నిర్ణయం తీసుకుంటారని తెలిసింది.

బాబు-ఉత్తమ్ భేటీ!?
ఇలావుంటే, టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు శనివారం హైదరాబాద్‌కు రానున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఉదయం 10.30 నుంచి గంట పాటు పార్టీ ముఖ్యులతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌తో పొత్తు కుదుర్చుకునే అంశంపై ప్రధానంగా చర్చిస్తారు. కుదుర్చుకుంటే లాభనష్టాలపై బేరీజు వేసి, అవసరమైతే ఉత్తమ్‌తో సమావేశమవుతారు. ఈ విషయమై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ శుక్రవారం ఉత్తమ్‌కు ఫోన్ చేసి ఎన్నికల్లో కలిసి పని చేసే విషయంపై చంద్రబాబుతో చర్చించాలని ఆహ్వానించారు. అందుకు ఉత్తమ్ సుముఖత వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్-టీడీపీ మైత్రికి దారి తీసే అవకాశం ఉన్నట్లు స్పష్టమవుతున్నది. ఇలావుంటే, చంద్ర బాబు హైదరాబాద్ వచ్చినప్పుడు, ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హరికృష్ణ నివాసానికి వెళ్లి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని తెలిసింది.

పొత్తుల కోసం కమిటీ..
ఏయే పార్టీతో పొత్తు కుదుర్చుకోవాలన్న అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు కాంగ్రెస్ నేతల అత్యవసర సమావేశంలో కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
బీజేపీ నేతల భేటీ..
ముందస్తు ఎన్నికలను ఎదుర్కొవడానికి బీజేపే నేతలు సమాయత్తమయ్యారు. శుక్రవారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే. లక్ష్మణ్, పార్టీ ఎంపీ బండారు దత్తాత్రేయ, తాజా మాజీ ఎమ్మెల్యేలు సమావేశమై సుదీర్ఘంగా చర్చించారు. ఈ నెల 15న పార్టీ జాతీయ అధ్యక్షుడు అమీత్ షా హైదరాబాద్‌కు రానున్నందున, ఆలోగా పార్టీ అభ్యర్థుల జాబితాను, ఎన్నికల ప్రణాళికనూ సిద్ధం చేసుకోవాలని నిర్ణయించారు.
ముందంజలో టీజేఎస్..
కేసీఆర్ ఏకంగా 105 మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణరంగంలోకి దిగడంతో, తాము ఏమీ తక్కువ లేమన్నట్లు తెలంగాణ జన సమితి (టీజేఎస్) అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ కూడా 19 పేర్లతో తొలి జాబితాను ప్రకటించారు. మిగతా పార్టీలతో చూస్తే టీఆర్‌ఎస్ తర్వాత టీజేఎస్ మాత్రమే పేర్లను ప్రకటించింది.