రాష్ట్రీయం

అమెరికాలో కాల్పులు - తెనాలి యువకుడుదుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, సెప్టెంబర్ 7: అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం రేగింది. ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా తెనాలి పట్టణం చెంచుపేటకు చెందిన కందేపి పృథ్వీరాజ్ (26) మృతిచెందిన వార్త ఈ ప్రాంత వాసులను దు:ఖసాగరంలో ముంచివేసింది. పృథ్వీరాజ్ ఉన్నత చదువులు చదివి, అమెరికాలోని సిన్సినాటీలో ఓ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్నాడు. శుక్రవారం పృథ్వీరాజ్ విధులు నిర్వహిస్తున్న బ్యాంకుపై దుండగులు దాడిచేసి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పృథ్వీరాజ్ సహా నలుగురు ఉద్యోగులు మృతిచెందారు. ఆ మేరకు అక్కడి బ్యాంకు అధికారులు తమకు సమాచారం అందించినట్లు పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుని తండ్రి గోపీనాథ్ ఏపీ రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థలో డీఈగా విజయవాడలో విధులు నిర్వహిస్తున్నారు. చిన్నవయస్సులో పృథ్వీరాజ్ మృతి చెందడంతో తండ్రి గోపీనాథ్, తల్లి సుధారాణి తట్టుకోలేక పోతున్నారు. ఇటీవలే ఫోనుచేసి త్వరలోనే ఇంటికి వస్తానంటూ చెప్పిన తనయుడు కాల్పుల్లో మృతిచెందటం తమను కలచివేసిందని తల్లి సుధారాణి బోరున విలపించింది. స్థానిక శాసన సభ్యుడు ఆలపాటి రాజేంద్రప్రసాద్ కుటుంబ సభ్యులను, తల్లిదండ్రులను పరామర్శించి ఓదార్చారు. పృథ్వీరాజ్ మృతదేహం త్వరలోనే అమెరికా నుండి తెనాలికి తీసుకువచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో మాట్లాడనున్నట్లు తెలిపారు.