రాష్ట్రీయం

రుజువు చేస్తే రాజకీయ సన్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 8: రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల విద్యుత్తు ఇవ్వలేదని, ఒకవేళ ఇస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని ఎప్పుడూ చెప్పలేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కే. జానారెడ్డి అన్నారు. అబద్దాలతో రాజకీయాల్లో విలువలు తగ్గించవద్దని కేసీఆర్‌కు హితవు పలికారు. టీఆర్‌ఎస్ సర్కారు 24 గంటలు విద్యుత్తు ఇస్తే తాను గులాబీ కండువా కప్పుకుంటానని చెప్పినట్టు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి తీవ్రంగా ప్రతిస్పందించారు. ప్రభుత్వం రెండు పంటలకు, కోటి ఎకరాలకు నీరు అందిస్తే తాను టీఆర్‌ఎస్ తరఫున ప్రచారం చేస్తానని చెప్పింది వాస్తవమేనని అన్నారు. ఎక్కడ కోటి ఎకరాలు, ఎక్కడ రెండు పంటలకు నీరు ఇస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ తాను అన్నట్టు చెప్తున్న మాటలను 24 గంటల్లోగా రుజువు చేయలేకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ రికార్డులు ప్రభుత్వం చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి తాను చేసిన వ్యాఖ్యలను బయట పెట్టాలని జానా రెడ్డి అన్నారు. తాను పొద్దున ఒకటి, రాత్రి మరొకటి మాట్లాడే వ్యక్తిని కానని వ్యాఖ్యానించారు.
తాను చరిత్రలో నిలిచిపోయే వ్యక్తినే తప్ప అబద్దాలతో కాలం గడిపే వ్యక్తిని కానని జానారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టకపోతే ఓట్లు అడగబోమని అసెంబ్లీలో చెప్పిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారని ఆయన నిలదీశారు.