రాష్ట్రీయం

పసుపు బోర్డు సాధనే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగిత్యాల, సెప్టెంబర్ 9: రైతుకు పచ్చ బంగారమైన పసుపు ధర క్వింటాల్ వరకు రూ.15వేలు పొందే వరకు పోరు ఆపేది లేదని మహాపాదయాత్రలతో ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకువస్తామని పసుపు రైతు మహాపాదయాత్రలో ముత్యాల మనోహర్‌రెడ్డి అన్నారు. ఆదివారం జగిత్యాల జిల్లాఅంతర్గాం గ్రామానికి పసుపు రైతు మహాపాదయాత్ర చేరుకుంది. ఈ సందర్భంగా మనోహన్‌రెడ్డి మాట్లాడుతూ పసుపు రైతులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని నీటి మూటలే అయ్యాయని, గత ఎన్నికల నాటినుంచి పసుపు రైతులు మద్ధతు ధర కోసం డిమాండ్ చేయడంతోపాటు పసుపు బోర్డు ఏర్పాటు చేయాలనే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. పసుపుబోర్డు ఏర్పాటు, మద్దతు ధరకు హామీ ఇచ్చిన నేతలు ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి గత నాలుగున్నరేళ్లుగా పసుపుబోర్డు ఏర్పాటుకై కేంద్ర మంత్రులకు వినతి, ప్రకటనలు చేస్తూ రైతులకు ఇచ్చిన హామీలు నీరుగారి పోతున్నాయని, ఆరుగాలం శ్రమించి అనేక కష్టనష్టాలకు ఓర్చి పసుపు పంట పండించిన రైతులకు ధర నిర్ణయించే అధికారం లేదని దళారీల చేతుల్లో అన్నదాతల బంధీ కావాలన్నదే పాలకుల విధానం అన్నట్లుగానే ఉందన్నారు. అన్నదాత దేశానికి వెన్నముఖ అనే ఉపన్యాసాలు చెప్పడం కాదు.. అమలు చేయలేని పాలకులను గద్దెదింపుతామని హెచ్చరించారు. పసుపు రైతుల పక్షాన పసుపు పంటకు మద్ధతు ధర కల్పించాలని, పసుపు బోర్డు ఏర్పాటు తదితర సమస్యల సాధన కోసం పాదరక్షలు సైతం వేసుకోకుండానే మహాపాదయాత్రను చేపట్టామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లు సాధించేవరకు మహాపాద యాత్ర కొనసాగిస్తామని, పాలకులపై ఒత్తిడి తీసుకువచ్చామని ముత్యాల మనోహర్‌రెడ్డి వెల్లడించారు. పసుపు రైతులు చేపట్టిన మహాపాదయాత్రకు జగిత్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి సంజయ్‌కుమార్ సంఘీభావం తెలిపారు. రైతు ఐక్య వేదిక నాయకులు తిరుపతిరెడ్డి, మనోహన్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

చిత్రం..పసుపు రైతు మహాపాదయాత్రకు స్వాగతం పలుకుతున్న
జగిత్యాల టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ సంజయ్‌కుమార్