రాష్ట్రీయం

అక్టోబర్‌లోగా రోడ్ల విస్తరణ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 9: వచ్చే అక్టోబర్ 15లోపు నగరంలోని ప్రధాన రహదారుల విస్తరణ, బీటీ పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు తాజామాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలిపారు. ఆదివారం నగరంలోని గీతాభవన్ చౌరస్థాలోని కూడలిలో ప్రధాన రహదారిపై కొనసాగుతున్న బీటీ పనులు పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, నగరంలో చేపడుతున్న రోడ్ల విస్తరణ శరవేగంగా పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. ప్రధానంగా వేములవాడ రోడ్డులో గల జయరాం ఆస్పత్రి వరకు, సివిలాసుపత్రి నుంచి నాకా చౌరస్థా వరకు, కమాన్ నుంచి ఎన్టీఆర్ చౌరస్థా వరకు పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టినట్లు వివరించారు. రోడ్ల విస్తరణ పనులతో గత కొద్దిరోజులుగా నగరవాసులు అనేక ఇబ్బందులెదుర్కొంటున్నారని, దీర్ఘకాల ఉపయోగం నేపథ్యంలో రహదారుల పనులు కొంతమేర నెమ్మదిగా కొనసాగుతున్నాయని, అసౌకర్యాలు భరిస్తూనే విస్తరణ పనులకు సహకరిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. మొదటి దశలో చేపట్టిన రూ.116కోట్ల పనులు పూర్తికావస్తున్నాయని, రెండోదశ పనులు కూడా త్వరలోనే పూర్తిచేసేందుకు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట మేయర్ రవీందర్ సింగ్, కార్పోరేటర్లు సునీల్‌రావు, వేణు, టీఆర్‌ఎస్వీ జిల్లాకో ఆర్డినేటర్ ద్యావ మధుసూధన్‌రెడ్డి, తెరాస నాయకులు, తదితరులు పాల్గొన్నారు.