రాష్ట్రీయం

టీఆర్‌ఎస్‌లో రాజుకున్న అసమ్మతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, సెప్టెంబర్ 10: టీఆర్‌ఎస్ అధినేత, ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ప్రకటించిన పార్టీ అభ్యర్థులపై రోజురోజుకు అసమ్మతి భగ్గుమంటోంది. టికెట్ ఆశించి భంగపడిన నాయకులు, అభ్యర్థులపై అసంతృప్తితో ఉన్న నాయకులు, కార్యకర్తలు అసమ్మతి శిబిరాల నిర్వహణతో అభ్యర్థులకు చుక్కలు చూపిస్తున్నారు. నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్ధి నోముల నరసింహయ్య అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం నియోజకవర్గంలోని హాలియాలో స్థానిక టీఆర్‌ఎస్ నేత ఎం.సి.కోటిరెడ్డి వర్గీయులు భారీ సమావేశం నిర్వహించారు. నియోజకవర్గానికి స్థానికేతరుడైన నోములకు ఇచ్చిన పార్టీ టికెట్ రద్దు చేసి స్థానికులైన తనకు, లేదా తేరా చిన్నపరెడ్డికి పార్టీ టికెట్ ఇవ్వాలన్న డిమాండ్‌తో ఎం.సి.కోటిరెడ్డి నిర్వహించిన ఈ సమావేశం బహిరంగ సభను తలపించింది. పార్టీ శ్రేణులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద ఎత్తున ఈ సభకు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. తేరా చిన్నపరెడ్డి వర్గీయులు సైతం ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ నేపధ్యంలో నోముల నరసింహయ్య అభ్యర్ధిత్వంపై టీఆర్‌ఎస్‌లో రకరకాల చర్చలు సాగుతున్నాయి. అటు మునుగోడు తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకిస్తున్న వేనెపల్లి వెంకటేశ్వర్లు, పల్లె రవికుమార్ వర్గీయులు సోమవారం హైద్రాబాద్‌లో భారీ సమావేశం నిర్వహించి కలకలం రేపారు. ఈ సమావేశానికి సైతం నియోజకవర్గం నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరవ్వడం చర్చనీయాంశమైంది. ఇప్పటికే తుంగతుర్తిలో స్థానికేతరుడైన సిట్టింగ్ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు టికెట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గిడ్డంగుల సంస్థ చైర్మన్ మందుల సామేల్ వర్గం బహిరంగ ప్రదర్శనలతో నిరసనలు నిర్వహించింది. ఇదే రీతిలో నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి అభ్యర్ధిత్వాన్ని వ్యితిరేకిస్తూ చకిలం అనిల్‌కుమార్ వర్గీయులు బహిరంగ సమావేశాలు నిర్వహించారు. దేవరకొండ టీఆర్‌ఎస్ అభ్యర్ధిగా సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్.రవీంద్రకుమార్‌కు టికెట్ ఇవ్వడంతో జడ్పీ చైర్మన్ ఎన్.బాలునాయక్ పార్టీనీ వీడిపోయే ఆలోచన సాగిస్తున్నారు. మిర్యాలగూడలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఎన్.్భస్కర్‌రావుకు టికెట్ ఇవ్వడంపై అల్గుబెల్లి అమరేందర్‌రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు. ఇక కోదాడ, హుజూర్‌నగర్ టీఆర్‌ఎస్ టికెట్లు ఆశిస్తున్న వారు పోటాపోటీగా కేసీఆర్ వద్ద తమ ప్రయత్నాలు సాగిస్తుండగా ఎవరికి టికెట్ ఇచ్చినా టికెట్ దక్కని వారు తిరుగుబాట్ల బెడద పొంచి ఉండగా అభ్యర్థులపై వ్యక్తమవుతున్న వ్యతిరేకతలు గులాబీ పార్టీకి ముళ్లల గుచ్చుకుంటు అధిష్ఠానాన్ని కలవరపెడుతుంది.
చిత్రం..హాలియాలో నోములకు వ్యతిరేకంగా ఎం.సీ.కోటిరెడ్డి వర్గీయుల సభ