రాష్ట్రీయం

చైనాలో ప్రపంచ ఆర్థిక సదస్సు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 12: వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశాల్లో మన దేశం తరఫున రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌కు ఆహ్వానం అందింది. మూడురోజుల పాటు 11 ముఖ్య సమావేశాలకు ఆయన హాజరై నవ్యాంధ్రలో పెట్టుబడులకు అనువైన పరిస్థితుల గురించి వివరించనున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం బోర్డ్ మెంబర్స్‌తో మంత్రి లోకేష్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ నెల 17 నుంచి 22 వరకు ఆయన చైనాలో పర్యటిస్తారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశంలో పాల్గొనడంతో పాటు పలు ఎలక్ట్రానిక్స్ కంపెనీల ప్రతినిధులను లోకేష్ కలిసి మాట్లాడతారు. కాగా, గన్నవరంలోని మేధా టవర్స్‌లో గురువారం ఉదయం 9గంటలకు హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్‌ను పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రారంభించనున్నారు. సంస్థ రాకతో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్‌ను అందిస్తున్న ఈ సంస్థ ఏర్పాటుతో వెయ్యి మందికి హై ఎండ్ ఉపాధి కల్పన జరగనుంది. మేధా టవర్స్ వేదికగా క్యాపిటల్ మార్కెట్స్, ఫండ్ అడ్మినిస్ట్రేషన్, ఇనె్వస్ట్‌మెంట్ మేనేజిమెంట్ సర్వీసెస్‌ను అందించాలని నిర్ణయించింది. హెచ్‌సీఎల్‌తో అమెరికాకు చెందిన స్టేట్ స్ట్రీట్ కంపెనీ భాగస్వామ్యం వహిస్తోంది. అమెరికా, కెనడా, యూరప్, మధ్యప్రాచ్య దేశాల్లో స్టేట్ స్ట్రీట్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. హెచ్‌సీఎల్ స్టేట్ స్ట్రీట్ ఏర్పడిన తర్వాత మన దేశంలో కోయంబత్తూర్‌లో 4వేల మందితో కార్యకలాపాలు నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంది.