రాష్ట్రీయం

గర్ల్‌ఫ్రెండ్ లేదా బోయ్‌ఫ్రెండ్‌ను పెట్టుకోండి...లేకుంటే జరిమానా విధిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యార్థులు బాయ్‌ఫ్రండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండాలని అమిటీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ కమాండర్ విశ్వదీపక్ సింగ్ జారీ చేసినట్టు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న ఒక సర్క్యులర్ అత్యంత వివాదాస్పదమైంది. ఈ సర్క్యులర్‌లో వాస్తవం ఎంతో తెలుసుకోవాలని, ఒక వేళ నిజంగానే ఇలాంటి సర్క్యులర్‌ను జారీ చేసి ఉంటే సంబంధిత రిజిస్ట్రార్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్‌ను కోరారు. రాజస్థాన్ జైపూర్‌లో ఉన్న అమిటీ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ఈ సర్క్యులర్‌ను జూలై 30న జారీ చేశారు. దీనికో రిఫరెన్స్ నెంబర్ కూడా ఇచ్చారు. కాపీని ప్రెసిడెంట్ ఆఫీసుకు, డీన్‌లకు, డైరెక్టర్లకు, కంట్రోలర్‌కు, అకౌంట్స్, హాస్టళ్లకు, నోటీసు బోర్డుకు మార్కు చేశారు. కేవలం కావాలని నకిలీ నోటీసును విద్యార్థులే రూపొందించారా లేదా నిజంగానే రిజిస్ట్రార్ జారీ చేశారా అన్నది ఇంకా తేలలేదు. దీని ప్రకారం ప్రతి విద్యార్థి ఆగస్టు 13 నుండి ఒక బాయ్‌ఫ్రెండ్ లేదా గర్ల్‌ఫ్రెండ్‌ను కలిగి ఉండాలని, అలా లేకుంటే వెయ్యి రూపాయిల జరిమానా విధించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సర్క్యులర్‌ను యూనివర్శిటీ ఇచ్చే అవకాశం లేదని, ఆకతాయి విద్యార్థులే దీనిని సృష్టించి ఉంటారని విద్యావేత్తలు పేర్కొంటున్నారు.