రాష్ట్రీయం

ఆపద్ధర్మ ప్రభుత్వమా? అధర్మ ప్రభుత్వమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణలో ప్రస్తుత పాలన ఆపద్ధర్మ ప్రభుత్వమా లేక అధర్మప్రభుత్వమా అంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకరెడ్డి ప్రశ్నించారు. బావస్వేచ్ఛ తెలంగాణలో అంతరించపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో శాస్ర్తియ విద్యా విధానం అమలు పర్చాలని విద్యాపోరాట బస్సు యాత్ర ప్రారంభాన్ని అడ్డుకోవడం దురదృష్టకరమన్నారు.ప్రచా సంఘాల నాయకులు ప్రొ.హరగోపాల్, ప్రొ. చక్రధరరావు.ప్రొ.లక్ష్మీనానాయణలరు పోలీసులు అరెస్టు చేయడం కేసీఆర్ దివాలాకోరు రాజకీయానికి పరాకాష్టగా ఆయన అన్నారు. ఇది ఆపధర్మ ప్రభుత్వమా లేక అధర్మ ప్రభుత్వమా అంటూ నిలదీశారు. ధర్నా చేయడానికో లేక ప్రభుత్వం దిగిపోవడానికో చేపట్టిన బస్సుయాత్ర కాదన్నారు. దేశ వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జిల్లాల్లో పర్యటించి విద్యా విధానంలో మార్పులు గురించి శాంతియుతంగా ప్రచారం నిర్వహించడానికి బయలుదేరిన బస్సును అడ్డుకోవడం ఏమిటని ఆయన దుయ్యబట్టారు.చదువుచెప్పే ప్రొఫెసర్లు వయస్సునస కూడా చూడకుండా హరగోపాల్ చొక్కాచించి కళ్ళాద్దాలు పగలగొట్టి అరెస్టు చేయడం ఏమర్జెన్సీని గుర్తు చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర అపధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న కెసీఆర్ అభ్రద్రత, నిరాశనిస్పృహలతో, రాబోవు ఎన్నికల్లో తనకు పరాభావం తప్పదని, ఇటువంటి నిరంకుశ చర్యలకు పాల్పడుతున్న సిఎం రానున్న రోజుల్లో ప్రజాగ్రహం చవిచూడక తప్పదన్నారు. తప్పుల మీద తప్పులు చేస్తున్న సిఎం ప్రజలు శిశుపాలుడి నూరు తప్పులు లాగా ఇక నూరేళ్ళు నిండాయని ఆయన జోస్యం చెప్పారు.