రాష్ట్రీయం

నేడే నింగిలోకి పీఎస్‌ఎల్‌వీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూళ్లూరుపేట, సెప్టెంబర్ 15: నెల్లూరు జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్ థావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి ఆదివారం రాత్రి 10:08 గంటలకు పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్‌ఎల్‌వీ)-సీ 42 రాకెట్ ప్రయోగం జరపనున్నారు. ఈ రాకెట్ ద్వారా బ్రిటన్ దేశానికి చెందిన రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపనున్నారు. ప్రయోగానికి సంబంధించిన కౌంట్‌డౌన్ శనివారం మధ్యాహ్నం 1:08 గంటలకు ప్రారంభమై సజావుగా సాగుతోంది. కౌంట్‌డౌన్ 33 గంటలు నిర్విఘ్నంగా కొనసాగినంతరం పీఎస్‌ఎల్‌వీ వాహక నౌక బ్రిటన్‌కు చెందిన 445 కిలోల బరువుగల నోవాసర్, 445 కిలోల బరువుగల ఎస్1-4 రెండు ఉపగ్రహాలను రోదసీలోకి తీసుకెళ్లనుంది. ప్రయోగం దృష్ట్యా ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆదివారం షార్‌కు రానున్నారు. షార్‌కు చేరుకొని ఆయన నేరుగా ప్రయోగ వేదికపై సిద్ధంగా ఉన్న పీఎస్‌ఎల్‌వీ రాకెట్ శాస్తవ్రేత్తలతో కలసి పరిశీలించి కౌంట్‌డౌన్ పనితీరును అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం మరోమారు శాస్తవ్రేత్తలతో సమావేశమై ప్రయోగంపై చర్చించనున్నారు. కౌంట్‌డౌన్ జరిగే ప్రక్రియలో భాగంగా రాకెట్‌లోని నాలుగు, రెండో దశల్లో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను శాస్తవ్రేత్తలు పూర్తిచేశారు. ఇంధనంతో పాటు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌ను నింపి రాకెట్‌లోని అన్ని వ్యవస్థల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మళ్లీ రాత్రికి రాకెట్ గ్లోబల్ పరీక్షలు చేసినంతరం అన్ని వ్యవస్థల పనితీరు బాగుంటే ప్రయోగానికి 8 గంటల ముందు రాకెట్‌కు విద్యుత్ సరఫరా ఇచ్చి రాకెట్‌ను ప్రయోగానికి సిద్ధం చేస్తారు. ఇప్పటికే షార్‌కు ఇస్రో శాస్తవ్రేత్తలతో పాటు బ్రిటన్ దేశ శాస్తవ్రేత్తలు కూడా చేరుకుని ప్రయోగ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. కౌంట్‌డౌన్ సజావుగా సాగి వాతావరణం అనుకూలిస్తే పీఎస్‌ఎల్‌వీ రాకెట్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం రాత్రి 10:08 గంటలకు నింగిలోకి ఎగరనుంది.