రాష్ట్రీయం

తాడిపత్రిలో సద్దుమణిగిన వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం: అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చిన్న పొడమల గ్రామంలో నెలకొన్ని వివాదం సద్దుమణిగింది. రెండు రోజుల క్రితం వినాయక నిమజ్జనం సందర్భంగా ప్రబోధానంద స్వామి ఆశ్రమ నిర్కాహకులు చిన్నపొలమడ, పెద్దపొలమడ గ్రామస్తుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులకు తెరపడింది. రెండు గ్రామాల ప్రజలు, ఆశ్రమ నిర్వాహకుల మధ్య తలెత్తిన వివాదం హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆశ్రమాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, స్థానికేతరులైన భక్తులను తరలించాలని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తాడిపత్రి పట్టణ పోలీసు స్టేషన్లో ఆదివారం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఆందోళన కొనసాగించారు. తాడిపత్రిలో శాంతిభద్రతలు అదుపు తప్పడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. అక్కడి పరిస్థితిని సమీక్షించి తక్షణ చర్యలు చేపట్టి శాంతిభద్రతలను నెలకొల్పాలని జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు. వాహనాలకు నిప్పుపెట్టడం, పరస్పర దాడులు, హింసాత్మకంగా మారడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో సోమవారం ఆశ్రమం వద్ద భారీగా సాయుధ పోలీసు బలగాలను మోహరించారు. కలెక్టర్ జీ.వీరపాండియన్, లా అండ్ ఆర్డర్ ఐజీ రవిశంకర్ అయ్యర్, కర్నూలు డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్, జిల్లా ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్, చిత్తూరు, కడప, ప్రకాశం ఎస్పీలు రాజశేఖర్, అట్టాడ బాపూజీ, సత్యేష్‌బాబు, ఆక్టోపస్ ఎస్పీ రాధిక ప్రబోధానందస్వామి ఆశ్రమం శాంతిభద్రతలు నెలకొల్పే దిశగా ముమ్మర చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ జీ.వీరపాండియన్, ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ నేతృత్వంలో అధికారుల బృందం త్రైత ఆశ్రమ నిర్వాహకులతో రెండు దఫాలుగా చర్చలు జరిపింది. ఎట్టకేలకు ఆశ్రమంలో ఉన్న స్థానికేతరులు అంగీకరించడంతో 500 మంది భక్తులను ఆర్టీసీ బస్సుల్లో వారి స్వస్థలాలకు తరలించారు. కేరళ, తమిళనాడు, ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ తదితర రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు చెందిన వారిని సాయుధ పోలీసు బలగాల నడుమ తరలించారు. ఆశ్రమ భద్రత నిమిత్తం పోలీసు బందోబస్తు ఉంచారు. అలాగే ఆశ్రమ నిర్వహణకు 50 మంది దాకా ఉండేందుకు అనుమతిచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ వీరపాండ్యన్ మాట్లాడుతూ తాడిపత్రి ఉదంతంపై సీఎం తనతో మాట్లాడారని, శాంతిభద్రతలకు విఘాతం కలగించకుండా చూడాలని ఆదేశించారన్నారు. ఆశ్రమంలో బారికేడ్లు, సీసీ కెమెరాల ఏర్పాటు, లైటింగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా శనివారం జరిగిన గొడవలకు సంబంధించి 15 కేసులు నమోదు చేసి 10 మందిని అరెస్టు చేశామని ఎస్పీ జీవీజీ.అశోక్‌కుమార్ తెలిపారు. దీంతో ఎంపీ దివాకర్‌రెడ్డి తన ఆందోళనను విరమించారు.
చిత్రం..ప్రబోధానంద శిష్యులను ఆశ్రమం నుంచి తరలిస్తున్న దృశ్యం