రాష్ట్రీయం

న్యూక్లియర్ రియాక్టర్ కోసం మరో స్థలం అనే్వషణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 16 : ఆంధ్రప్రదేశ్‌లో విద్యుదుత్పత్తికి న్యూక్లియర్ రియాక్టర్‌ను ఏర్పాటు చేసేందుకు అనువైన మరొక స్థలం కోసం వెతుకుతున్నామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శాసనమండలిలో బుధవారం ప్రశ్నోత్తరాల సమయంలో డాక్టర్ ఎంవివిఎస్ మూర్తి తదితరులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి తరఫున కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు సమాధానం ఇస్తూ, విద్యుత్ ఉత్పత్తికోసం న్యూక్లియర్ రియాక్టర్‌ను నెలకొల్పాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కొవ్వాడ గ్రామం వద్ద స్థలాన్ని న్యూక్లియర్ పవర్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పరిశీలించిందన్నారు. ఈ స్థలంలో న్యూక్లియర్ పవర్ పార్కును ఏర్పాటు చేయాలని భావించామన్నారు. ఒక్కో యూనిట్ 1594 మెగావాట్ల సామర్థ్యంతో ఆరు యూనిట్లను నెలకొల్పాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు. ఇదికాకుండా మరొక అనువైన స్థలాన్ని న్యూక్లియర్ పవర్ రియాక్టర్‌ను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఉందని, ఇందుకోసం స్థలం అనే్వషిస్తున్నామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాల్లో గ్యాస్ పైప్‌లైన్లు లీక్ కాకుండా గట్టి చర్యలు తీసుకున్నామని తెలిపారు. రవికిరణ్ వర్మ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ, 2014 జూన్‌లో గ్యాస్‌పైప్‌లైన్ లీక్ అయి ప్రమాదం జరిగిన తర్వాత మళ్లీ ఎలాంటి ప్రమాదం జరగలేదన్నారు. చేనేత, మరమగ్గం రంగానికి రుణాల మాఫీ కోసం పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని వెనుకబడిన తరగతుల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే ఇంట్లో సిబిఐ సోదాలు
రూ.44.9 లక్షల నగదు స్వాధీనం
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మార్చి 16: విశాఖ నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి మళ్ల విజయ్‌ప్రసాద్ ఇంట్లో సిబిఐ బుధవారం సోదాలు నిర్వహించింది. ఎమ్మెల్యే ఇంట్లో లెక్కలు చూపని రూ.44.9 లక్షల నగదును సిబిఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలోని ప్రైవేటు చిట్స్‌ఫండ్ కంపెనీలకు సంబంధించి సిబిఐకి అందిన ఫిర్యాదు మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 82 ప్రాంతాల్లో అధికారులు సోదాలు నిర్వహించారు. ఒక స్థిరాస్తి కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న మాజీ ఎమ్మెల్యే విజయ్‌ప్రసాద్ కార్యాలయాల్లో సైతం సోదాలు నిర్వహించారు. ఇదే వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన కంపెనీలపై గతంలో సిబిఐ రెండు కేసులు నమోదు చేసింది. కంపెనీకి చెందిన మాజీ డైరెక్టర్ నుంచి రూ.16.8 లక్షలను సిబిఐ స్వాధీనం చేసుకుంది.
ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్
ఆంధ్రభూమి బ్యూరో
చిత్తూరు, మార్చి 16 : కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి నాలుగు వాహనాలతో పాటు మూటు కోట్ల రూపాయలు విలువ చేసే 320 ఎర్రచందనం దుంగలను చిత్తూరు టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ శ్రీనివాస్ కథనం మేరకు జిల్లాలో వాహనాల తనిఖీలో భాగంగా కల్లూరులో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఎర్రచందనాన్ని తీసుకెళ్తున్న ఇన్నోవా వాహనం ఆగకుండా వెళ్లడంతో పోలీసులు వెంబడించారు. కొంతదూరం వెళ్లగానే దుండగులు కారును వదలి పారిపోయారు.

రెండు లారీలు ఢీ: డ్రైవర్ సజీవ దహనం
పెనుబల్లి, మార్చి 16: ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం లంకపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండు లారీలు ఢీకొనటంతో ఓ లారీ డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. మెదక్ జిల్లా నారాయణ్‌ఖేడ్ నుండి ఉల్లిపాయల లోడ్‌తో సత్తుపల్లి వైపు వెళ్తున్న లారీని ఎదురుగా వస్తున్న మరో లారీ ఢీకొన్న సంఘటనలో మంటలు చెలరేగాయి. జగ్గయ్యపేటకు చెందిన డ్రైవర్ లారీలోనే ఇరుక్కుపోయి పూర్తిగా దహనమయ్యాడు. మృతి చెందిన డ్రైవర్ వివరాలు ఇంకా తెలియాల్సి ఉండగా మరో లారీ డ్రైవర్ బాబుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న సత్తుపల్లి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేసేలోపే రెండు లారీలు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఈ సమయంలో ఒక లారీలో నుండి లారీ డ్రైవర్ దూకడంతో ప్రాణాలతో బయటపడగా మరో లారీలోని డ్రైవర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి బయటకు రాలేని పరిస్థితిలో మంటలు వ్యాపించడంతో ఆయన అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.

రాష్ట్ర వ్యాప్తంగా
నేడు వర్తక బంద్
ఆంధ్రభూమి బ్యూరో
రాజమహేంద్రవరం, మార్చి 16: రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా గురువారం రాష్టవ్య్రాప్తంగా వర్తకులు తమ దుకాణాలను మూసివేసి నిరసన వ్యక్తంచేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న వాణిజ్య పన్నుల విధానం కారణంగా వ్యాపారాలు చేయలేని పరిస్థితి ఏర్పడుతోందని, ఆ శాఖ అధికారుల వేధింపులు తీవ్రమయ్యాయని వర్తకులు గత కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తిని వ్యక్తంచేస్తున్న సంగతి విదితమే. చిన్న వ్యాపారులు కూడా వే బిల్లుతోనే అమ్మకాలు సాగించాలన్న విధానంతో పాటు, సరుకులు వర్గీకరణ విధానాన్ని వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. చిన్న చిన్న పొరపాట్లకు కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు కేసులు నమోదుచేస్తూ, భారీగా జరిమానాలు విధిస్తుండటంతో ఇక తాము వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో ఉన్నామంటూ వర్తకులు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. 13న జరిగిన రాష్ట్ర వర్తక సదస్సు రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చింది. రాష్ట్ర సదస్సు తీర్మానానికి అనుగుణంగా అన్ని జిల్లాలకు చెందిన వర్తక సంఘాలు గురువారం బంద్ నిర్వహించడానికి సమాయత్తమవుతున్నాయి. అనంతపురం, కర్నూలు, గుంటూరు, విజయనగరం, పశ్చిమగోదావరి తదితర జిల్లాల నుండి వర్తక సంఘాలు బంద్‌కు మద్దతు తెలుపుతూ సమాచారాన్ని పంపించాయని ఆంధ్రప్రదేశ్ వర్తక సంఘాల ఫెడరేషన్ కన్వీనర్ అశోక్‌కుమార్ జైన్ చెప్పారు.