రాష్ట్రీయం

ఉద్యోగాల జాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: వచ్చేనెల 2వ తేదీ నుంచి యువనేస్తం కింద నిరుద్యోగ భృతి కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్న ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి రాష్టవ్య్రాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20వేలకు పైగా పోస్టులు భర్తీచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ 1, 2, 3, డీఎస్సీ, పోలీస్ విభాగంతో పాటు వివిధ శాఖల్లో ఉన్న 20,010 ప్రభుత్వ ఉద్యోగాలను సత్వరమే భర్తీచేయాలని మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏపీపీఎస్సీ, డీఎస్సీ ద్వారా ప్రత్యక్ష పద్దతిలో ఖాళీల నియామకం జరపాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న ఖాళీలతో పాటు అవసరాల దృష్ట్యా మెగా రిక్రూట్‌మెంట్‌కు ముఖ్యమంత్రి ఆమోద ముద్రవేశారు.
నియామకాల వివరాలు: గ్రూప్-1 ఖాళీలు 150, గ్రూప్-2 ఖాళీలు 250, గ్రూప్-3 ఖాళీలు 1670 కాగా డీఎస్సీ ద్వారా 9275 పోస్టులు భర్తీ కానున్నాయి. పోలీస్ ఎగ్జిక్యూటివ్, ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీలో మొత్తం ఖాళీల సంఖ్య 3వేలు కాగా వైద్యశాఖలో 1604, ఇతర విభాగాల్లో 1636 పోస్టులకు నోటిఫికేషన్ వెలువడనుంది. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310, ఏపీఆర్‌ఈఐ సొసైటీలో 10, ఏపీఆర్‌ఈఐ సొసైటీ డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 5, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200 సమాచార పౌర సంబంధాల శాఖలో ఖాళీగా ఉన్న 21 పోస్టులలో డీపీఆర్‌వో పోస్టులు 4, ఏపీఆర్వో పోస్టులు 12, డీఈటీఈ పోస్టులు 5 భర్తీ చేయనున్నారు. డీఎస్సీ ద్వారా నియామకం చేపట్టే ఖాళీల వివరాలిలా ఉన్నాయి. మునిసిపల్ పాఠశాలల్లో 1100, గురుకుల పాఠశాలల్లో టీచర్ పోస్టులు 1100, సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 750, షెడ్యూల్ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో 500, నాన్ షెడ్యూల్ ఏరియాలోని ఆశ్రమ పాఠశాలల్లో 300 ఖాళీలు, బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 350, ఏపీఆర్‌ఈఐ సొసైటీలో ఉపాధ్యాయ పోస్టులు 175 ఉన్నాయి. ప్రకటించిన మొత్తం ఖాళీలను సత్వరమే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వీలైనంత త్వరలో నియామకపు ప్రక్రియ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.