రాష్ట్రీయం

న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిర్యాలగూడ టౌన్, సెప్టెంబర్ 18: ప్రభుత్వం, పోలీసులు తమ కుటుంబానికి న్యాయం చేయకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హత్యకు గురైన దళిత యువకుడు పి.ప్రణయ్‌కుమార్ భార్య అమృతవర్షిణి, తమ్ముడు అజయ్‌కుమార్, తల్లిదండ్రులు హేమలత, బాలస్వామిలు అన్నారు. మంగళవారం రాత్రి ప్రణయ్ ఇంటికి వచ్చిన జిల్లా కలెక్టర్ ఉప్పల్ గౌరవ్ ముందు ప్రణయ్ భార్య అమృత మాట్లాడుతూ తనను తన బాబాయి శ్రవణ్ తీవ్రంగా హింసించాడని, తండ్రి తీవ్రంగా బెదిరించాడన్నారు. వారు అరెస్టు అవడం జరిగిందని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వేగంగా విచారణ జరిపాలన్నారు. వాళ్ళు బెయిల్ మీద 15 రోజుల్లో వస్తే తాము సిబిఐని ఆశ్రయిస్తామని అక్కడ కూడ న్యాయం జరగకుంటే తాము ఆత్మహత్య చేసుకుంటామన్నారు. ఆత్మహత్య చేసుకునే ముందు నిందితులను శిక్షించడంలో ప్రభుత్వం, పోలీసులు బాధ్యులుగా వాంగ్మూలం రాసి మరి ఆత్మహత్య చేసుకుంటామని పేర్కొన్నారు.
తొలి విడత ఆర్థిక సాయం అందించిన కలెక్టర్
హత్యకు గురైన పెరుమాళ్ల ప్రణయ్‌కుమార్ కుటుంబానికి రూ.4,12,500 రూపాయల ఆర్ధిక సహాయాన్ని కుటుంబ సభ్యులకు మంగళవారం రాత్రి నల్లగొండ జిల్లా కలెక్టర్ ఉప్పల్‌గౌరవ్ అందించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ హత్యకు గురైన దళిత యువకుడు ప్రణయ్‌కుమార్ గురించి సంపూర్ణ విచారణ జరపాలని కుటుంబ సభ్యులు కోరారని అన్నారు. హత్యా నేరం, ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి చట్టాల కింద పోలీసులు నిందితులపై కేసులు నమోదు చేశారన్నారు. ఎస్‌సి, ఎస్‌టి అట్రాసిటి యాక్టు నమోదైనందున మొదటి విడతగా 4,12,500 రూపాయలు, రెండో విడత అంతే మొత్తాన్ని ఇవ్వనున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ జగన్నాధరావు తదితరులున్నారు.

చిత్రం..ప్రణయ్ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న నల్లగొండ కలెక్టర్ గౌరవ్