రాష్ట్రీయం

గజవాహనంపై ఊరేగిన గజముఖుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 19: చిత్తూరు జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామివారు సిద్దిబుద్ధి సమేతంగా గజవాహనంపై అశీనులై కాణిపాకం మాడావీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వాహన సేవకు కాణిపాకం వన్నియనాయకర్ వంశస్థులు ఉభయదారులుగా వ్యవహరించారు. ఉదయం స్వామివారి మూలవిరాట్‌కు పంచామృతాభిషేకం నిర్వహించి దీపధూప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేపట్టారు. రాత్రి స్వామివారి ఉత్సవ మూర్తులైన సిద్దిబుద్ధి సమేత వినాయకస్వామివారి సర్వాలంకారంగా అలంకరించి వేంచేపు చేశారు. ఉభయదారులు ఉభయ వరుస తీసుకురాగా ప్రత్యేక పూజలు అనంతరం గజవాహనంపై స్వామివారిని ఆశీనులు చేసి కాణిపాకం మాడ వీధుల్లో మేళతాళాల మధ్య స్వామివారు విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.