రాష్ట్రీయం

ఎక్కడకు బస్సు అడిగినా ఇస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 19: శాసనసభ్యుల నుంచి తరచుగా ఫలానా గ్రామానికి బస్సు కావాలంటూ సిఫార్సులు వస్తున్నాయి... ఏ ప్రాంతానికి బస్సు అడిగినా వెంటనే ఇస్తాం.. అయితే ప్రజలు కూడా వినియోగించుకునేలా చూడాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. లాభాలు లేకపోయినా నష్టాలు లేకుండా చూడాలని ప్యాసింజర్లు లేకుండా బస్సులు నడిపే పరిస్థితి ఉండరాదంటూ శాసనసభ ప్రశ్నోత్తరాలలో పీలా గోవింద సత్యనారాయణ అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. పల్లె వెలుగు సర్వీసులు పెంచుతామన్నారు. గత నాలుగేళ్లలో ఆక్యుపెన్సీ 40 నుంచి 70 శాతానికి పెరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి అమరావతికి కొత్త బస్సులను నడుపుతున్నామని, ఎమ్మెల్యేలు కూడా వాటిల్లో ప్రయాణిస్తున్నారని అన్నారు. అనకాపల్లి బస్ డిపో, కశింకోట బస్ స్టేషన్‌లను ఆధునికీకరించడం లేదన్నారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖలో బస్ స్టాప్‌లు చాలా ఉన్నాయని అయితే అక్కడ మరుగుదొడ్ల సౌకర్యం లేదన్నారు. వర్మ మాట్లాడుతూ పిఠాపురం పట్టణం నుంచి అన్ని బస్‌లు వెళ్లేలా చూడాలని కోరారు. పిఠాపురం - కాకినాడ సిటీ సర్వీస్ నడపాలన్నారు. విప్ కూన రవికుమార్ మాట్లాడుతూ కొన్ని ముఖ్య ప్రాంతాల్లో బస్సు సర్వీసులు తక్కువగా ఉన్నందున ప్రజలు ఆటోలపై అధారపడుతున్నారని అన్నారు. జోగేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కపిలేశ్వరం మండలంలో రోడ్లన్నీ పాడైపోగా ఆర్టీసీ సర్వీసులు ఆపారు. ప్రస్తుతం రోడ్లు బాగైనా బస్సులు నడవడంలేదన్నారు.