రాష్ట్రీయం

వచ్చే ఎన్నికలకు నంద్యాల విజయమే పునాది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (సిటీ): టీడీపీ ప్రభుత్వ పనితీరుకు ప్రజలు ఇచ్చిన రిఫరెండమ్ నంద్యాల గెలుపేనని, వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈ గెలుపు పునాదిగా ఉంటుందని రాష్ట్ర మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాలువ శ్రీనివాసులు పేర్కొన్నారు. గత ఎన్నికల్లో కర్నూలులో తక్కువ సీట్లకే పరిమితమైన టీడీపీ నేడు జిల్లాను కంచుకోటగా మార్చుకుందన్నారు. రైతు సంక్షేమమే ఆకాంక్షగా చంద్రబాబు నాయుడు పాలన అందిస్తున్నట్లు చెప్పారు. పార్టీలో కష్టపడి పనిచేస్తున్న ప్రతీ కార్యకర్తను గుర్తించుకుని, సముచిత స్థానం కల్పిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఆళ్లగడ్డ టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ నంద్యాల ఎన్నికల్లో జగన్ 15 రోజులు ఉండి, వీధి వీధిలో తిరిగి ప్రచారం చేసినప్పటికి ఆయనను ప్రజలు నమ్మలేదన్నారు. పార్టీ నేతలను, కౌన్సిలర్లను వైకాపా నేతలు కిడ్నాప్‌లు చేసి బెదిరించిన సమయంలో పార్టీ క్యాడర్ చెక్కు చెదరకుండా వారి వెన్నంటి నడిపించిన వ్యక్తి ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. నాడు సమష్టి కృషితో సాధించిన నంద్యాల గెలుపు రాష్ట్రానికి ఒక సందేశాన్ని పంపించిందన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ బలోపేతానికి కృషి చేసే ప్రతీ కార్యకర్తను పార్టీ గుర్తిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ, నంద్యాల సీట్లు గెలిపించే బాధ్యత ఏవిపైనే ఉందన్నారు. కర్నూలు జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ రాయలసీమను అభివృద్ధి చేసేందుకు అత్యధిక నిధులను ఆ ప్రాంతానికే కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాయలసీమకు నీటిని అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.
కలసికట్టుగా అందరూ కలసి పని చేసి వచ్చే ఎన్నికల్లో కర్నూలు జిల్లాలోని 13 సీట్లనూ గెలిపించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఏవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం విజయవాడలోని సంస్థ కార్యాలయంలో గురువారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆళ్లగడ్డ, నంద్యాల నియోజకవర్గాల నుండి 300 వాహనాల్లో భారీగా ఆయన అనుచరులు తరలివచ్చారు. వేదపండితుల ఆశీర్వాదాల మధ్య ఆయన చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ రైతులకు ఒక భరోసా కల్పించేవిధంగా కార్పొరేషన్‌ను తీర్చుదిద్దుతానన్నారు. నూతన గోడౌన్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
షేరు హోల్డర్స్‌కు కార్పొరేషన్ ద్వారా రావాల్సిన డివిడెంట్ వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. అత్యధిక దిగుబడి వచ్చే నాణ్యమైన విత్తనాలను రైతుకు అందించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ శాసన మండలి చైర్మన్ ఎన్‌ఎండి ఫరూఖ్, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్, కర్నూలు జెడ్పీ చైర్మన్ రాజశేఖర్, కార్పొరేషన్ ఎండీ బాలకృష్ణ, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులతో పాటు ఆళ్లగడ్డకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.