రాష్ట్రీయం

పేట్రేగిన మిలిటెంట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీనగర్, సెప్టెంబర్ 21: జమ్ముకాశ్మీర్ ఉగ్రవాదులు మరోమారు పేట్రేగిపోయారు. దక్షిణ కాశ్మీర్‌లోని షోఫియాన్ జిల్లాలో ముగ్గురు పోలీసులను కిడ్నాప్ చేసిన హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులు వారిని కాల్చి చంపారు. ఉగ్రవాద చరిత్రలో పోలీసుల ఇళ్లల్లోకి చొరబడి కిడ్నాప్ చేసి చంపడం ఇదే తొలిసారి. గత మూడు దశాబ్దాలుగా ఈ రకమైన ఘటన ఎన్నడూ జరగలేదు. జమ్ముకాశ్మీర్ పోలీసు విభాగంలో 1.2 లక్షల మంది పోలీసులు పనిచేస్తున్నారు. ఈ ఘటన పోలీసు శాఖను కుదిపేసింది. ఈ ఘటనతో భీతిల్లిన ఆరుగురు పోలీసులు ఉద్యోగాలకు గుడ్‌బై చెబుతున్నట్లు ప్రకటించారు. వీరు సామాజిక మాధ్యమాల ద్వారా ఈ ప్రకటన చేశారని అధికారులంటున్నారు. ఉగ్రవాదుల ఘాతుకానికి బలైన పోలీసులు నిస్సార్ అహ్మద్, ఫిర్దోస్ అహ్మద్, కుల్వంత్ సింగ్‌లుగా గుర్తించారు. నదీతీరంలోని ఒక తోటలో ఈ ముగ్గురు పోలీసుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దృశ్యాలను వీడియోలో చిత్రీకరించి ఉగ్రవాదులు ప్రసారం చేశారు. కాశ్మీర్‌లో ప్రత్యేక పోలీసు అధికారులుగా పనిచేస్తున్న వారంతా రాజీనామా చేయాలని ఉగ్రవాదులు బెదిరించారు. ఈ ముగ్గురు పోలీసులు ఉగ్రవాదుల అమానుషానికి బలయ్యారంటూ వీరికి నివాళులు అర్పిస్తున్నట్లు పోలీస్ ఐజీ స్వయం ప్రకాశ్ పాణి చెప్పారు. భద్రతా బలగాల చేతిలో హతమవుతున్న ఉగ్రవాదులు నిరాశా నిస్పృహలకు లోనై ఈ దారుణానికి ఒడిగట్టారని అన్నారు. త్వరలోనే బాధ్యులైన వారిని పట్టుకుని శిక్షిస్తామన్నారు. శుక్రవారం తెల్లవారు జామును ఈ పోలీసులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్లు పోలీసులు చెప్పారు. ఎదురుతిరిగిన గ్రామస్థులను తుపాకులు పేల్చి బెదిరించారు. ఈ ఘాతుకానికి పాల్పడిందే తామేనంటూ హిజ్బుల్ ఉగ్రవాదులు సామాజిక మాధ్యమం ద్వారా ప్రకటించారు. పోలీసు శాఖలో భయోత్పాతాన్ని సృష్టించడానికి ఉగ్రవాదులు హింసకు పాల్పడ్డారని ప్రభుత్వం పేర్కొంది. కాగా ఈ ఘటనలను మాజీ ముఖ్యమంత్రి మెహబూబా మఫ్తీ ఖండించారు. ఈ దుర్ఘటన తనను కలిచివేసిందని అన్నారు. రాష్ట్రంలో పంచాయతీలు, మున్సిపాలిటీలకు ఎన్నికల తేదీలను ఖరారు చేసిన తర్వాత ఈ హత్యాకాండ చోటుచేసుకోవడం గమనార్హం.

పోలీసుల రాజీనామా అభూతకల్పన
కాశ్మీర్‌లో ఉగ్రవాదుల హింసాకాండకు ముగ్గురు పోలీసులు బలైన నేపథ్యంలో ఆరుగురు పోలీసులు ఉద్యోగాలకు రాజీనామా చేశారంటూ వెలువడిన సమాచారం నిజం కాదని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వాస్తవానికి రాజీనామా చేసినట్లు చెబుతున్నవారు గతంలోనే పోలీసు ఉద్యోగాలకు రాజీనామా చేశారని అన్నారు. హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థ తప్పుడు ప్రచారం చేస్తూ పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు కుట్రపన్నుతోందని హోం శాఖ పేర్కొంది. రాష్ట్రంలో 30వేల మంది స్పెషల్ పోలీసు ఆఫీసర్లున్నారు. వీరి సర్వీసులను ఎప్పటికప్పుడు పునరుద్ధరిస్తారు. కాశ్మీర్‌లో భద్రతా బలగాల ఆపరేషన్లలో షోపియాన్ జిల్లాలో ఈ ఏడాది ఇంతవరకు 28 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.