రాష్ట్రీయం

కాణిపాకంలో ఘనంగా త్రిశూలస్నానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఐరాల, సెప్టెంబర్ 22: చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం ధ్వజావరోహణం కన్నుల పండుగగా జరిగింది. వినాయకచవితి రోజున స్వర్ణ ధ్వజస్థంభంపై ఎగరేసిన మూషిక ధ్వజపటాన్ని మేళతాళాలు వేదమంత్రోచ్చరణల నడుమ అర్చకులు కిందకు దించారు. ధ్వజావరోహణం జరగడంతో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిసినట్లు అయింది. ఆదివారం నుంచి ఆలయంలో 11 రోజులపాటు ప్రత్యేక ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
శాస్త్రోక్తంగా త్రిశూలస్నానం
స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి బ్రహ్మోత్సవాల్లో శనివారం ఆలయం పుష్కరిణిలో త్రిశూల స్నానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవ సమయంలో స్వామిని దత్తగా త్రిశూలాన్ని యాగశాలలో ఉంచుతారు. ప్రతి రోజు ఉదయం పురవీధుల్లో త్రిశూలాన్ని ఊరేగిస్తారు.
ఉత్సవాలు ముగిసిన సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద త్రిశూలాన్ని ఉంచి విశేష పూజలు నిర్వహించారు. 108 మట్టి కుండలలో ఉంచిన నవధాన్యాలను తీసుకొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. త్రిశూలాన్ని మట్టి కుండలో మొలకెత్తిన నవధాన్యాలను పుష్కరిణిలో నిమజ్జనం చేశారు.

చిత్రం..కాణిపాకం క్షేత్రంలో స్వామి పుష్కరిణిలో త్రిశూల స్నానం చేయిస్తున్న అర్చకస్వాములు