రాష్ట్రీయం

కర్నాటక జల దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మార్చి 19: తుంగభద్ర రిజర్వాయర్ పరిధిలోకర్నాటక జలమండలి యథేఛ్ఛగా జల దోపిడీ సాగిస్తోంది. కర్నాటక జల మండలి ఎంతోకాలంగా ఈ అక్రమానికి పాల్పడుతుండగా ఆ జలాల్లో వాటాదారైన ఆంధ్రప్రదేశ్ మాత్రం పట్టించుకోవటం లేదు. ప్రతి ఏటా మైనస్ ఇన్‌ఫ్లో పేరిట ఈ మేరకు జల దందా సాగిస్తోంది. దీనివల్ల తుంగభద్ర పరివాహక ప్రాంతంలోని కర్నాటక రాష్ట్ర భూములు సస్యశ్యామలం అవుతుండగా నిత్య కరవుజిల్లాలుగా పేరుబడ్డ అనంతపురం, కడప, కర్నూలు జిల్లాల్లోని పొలాలు బీడువారుతున్నాయి. మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాలో కర్నాటక జల మండలి తెలివిగా జల దోపిడీకి తెర తీసింది. తుంగభద్ర రిజర్వాయర్‌లోకి వచ్చే నీటిని ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం పంచుకోవాల్సి ఉంది. అయితే మన రాష్ట్రానికి రావాల్సిన న్యాయమైన వాటాలో కర్నాటక జల మండలి తెలివిగా జల దోపిడీకి తెర తీసింది. ఇలా కొన్ని సంవత్సరాలుగా కర్నాటక జల చౌర్యానికి పాల్పడుతోంది. 1978-79 నుంచి లెక్కలను ఒకమారు పరిశీలిస్తే కర్నాటక సాగిస్తున్న భారీ జల దోపిడీ అవగతమవుతుంది. అనంతపురం జిల్లాలో అత్యంత నీటి కరవు పరిస్థితుల్లో (2014-15లో) కూడా భారీగా నీటిని దోచుకున్నారు. అదికూడా తుంగభద్ర బోర్డు ఇచ్చే నివేదికల్లో చూపించి మరీ దోపిడీకి తెగబడుతూనే ఉన్నారు.ప్రతి సంవత్సరం ఇదే తంతు జరుగుతున్నా ఆంధ్రా అధికారులు ప్రశ్నించిన పరిస్థితి లేదు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు.ప్రతి ఏటా బోర్డు సమావేశానికి మొక్కుబడిగా వెళ్లడం, సంతకం పెట్టి రావడమే మన జలమండలి అధికారుల పనిగా మారింది. తుంగభధ్ర రిజర్వాయర్ నుంచి అధికారికంగా దోచుకుంటున్నట్టు కర్నాటక జల మండలి ఇచ్చే నివేదికలోనే స్పష్టంగా తెలుస్తుండగా దీనికి బోర్డు కూడా ఆమోద మద్ర వేయడం గమనార్హం. ఇలా రిజర్వాయర్ ప్రారంభమైన 1978-79 నుంచి 2014-15 వరకు 446.475 టిఎంసిల నీటిని కర్నాటక దర్జాగా తరలించుకుంది. తుంగభద్ర ఎడమ కాలువ నుంచి అనధికారికంగా దాదాపు ఇదే పరిమాణంలో జల దోపిడీ జరుగుతున్నట్టు జల మండలి అధికారులు పేర్కొంటున్నారు. దీనిని బట్టి గత 37 ఏళ్లలోతుంగభద్ర రిజర్వాయర్ నుంచి కర్నాటక సుమారు 900 టిఎంసిల నీటిని దోచేసింది.