రాష్ట్రీయం

సరస్వతీదేవిగా దుర్గమ్మ దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 14: ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో ఐదోరోజు ఆశ్వయుజ శుద్ధ పంచమి ఆదివారం దుర్గమ్మ శ్రీ సరస్వతీదేవి అలంకారంలో భక్తకోటికి దర్శనమిచ్చింది. మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన దుర్గాదేవి తన నిజస్వరూపంతో సాక్షాత్కరించడమే కాకుండా మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతీదేవి అలంకారంలో దర్శనమిచ్చింది. భక్తజనుల అజ్ఞానాన్ని పారదోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతీదేవి. అందుకే విద్యార్థినీ విద్యార్థులకు సరస్వతీ అమ్మవారంటే అమితమైన ఇష్టం. దీంతో శనివారం అర్ధరాత్రి నుంచే భక్తజనంతో ఇంద్రకీలాద్రి, విజయవాడ నగరం పోటెత్తాయి. నగరంలో ఎటుచూసినా భక్తజనమే కనిపించారు. కృష్ణానదిలో అన్ని ఘాట్ల వద్ద రద్దీ నెలకొంది. విద్యార్థినీ విద్యార్థులే కాకుండా సర్వజనులూ ఈరోజు దుర్గమ్మను దర్శిస్తే తమ దుర్గతులన్నీ నశిస్తాయని విశ్వసిస్తారు. అందుకే ఆలయ అధికారులు ఈ ఒక్కరోజే తెల్లవారుజాము ఒంటి గంట నుంచే భక్తులకు అమ్మవారి దర్శనభాగ్యం కల్పించారు. అయినా రాత్రి వరకూ క్యూలైన్లు కిటకిటలాడుతూనే కనిపించాయి. రద్దీని దృష్టిలో ఉంచుకొని అంతరాలయ దర్శనం, వీఐపీల ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు..