రాష్ట్రీయం

ప్రతిభకు పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, అక్టోబర్ 15: ఏపీజే అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాలు పొందిన యువతకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు వరాల జల్లు కురిపించారు. ఆ యువతకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగం వస్తే ప్రస్తుతం ఉన్న 60 సంవత్సరాల స్థానంలో 61 సంవత్సరాలకు పొడిగిస్తున్నట్లు వెల్లడించారు. ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని మినీ స్టేడియంలో సోమవారం ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 7010 మంది విద్యార్థులకు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ యువత ఇష్టంతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ప్రతిభా అవార్డులకు కులం ఆటంకం కాకుడదనే అన్ని వర్గాల వారికి అందచేశామన్నారు. దివంగత మాజీ రాష్టప్రతి అబ్దుల్ కలాంలాగా గొప్ప వ్యక్తులుగా తయారుకావాలని ఆయన విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు. కలాంను రాష్టప్రతి చేయటంలో తాను కీలకపాత్ర పోషించానని ఆయన సగర్వంగా చెప్పుకున్నారు. కలాం పేదరికం తెలిసిన వ్యక్తి అని ఆయన కొనియాడారు. అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం కలాం పనిచేశారని ఆయన తెలిపారు. దేశాభివృద్ధి, రాష్ట్భ్రావృద్ధిలో యువత భాగస్వాములు కావాలని ఆయన ఆకాంక్షించారు. దేశానికి, రాష్ట్రానికి యువత ఆస్తిలాంటివారని ఆయన కొనియాడారు. పిల్లలు బాగా చదవి తాము ఉద్యోగాలు చేస్తూ ఇతరులకు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆయన పిలుపునిచ్చారు. యువతకు స్ఫూర్తి నిచ్చిన మహానీయులు కలాం అని ఆయన కొనియాడారు. భవిష్యత్తుకోసం యువత కష్టపడాలని, గుర్తింపు, గౌరవం కోసం జీవించాలని కోరారు. ప్రతిభా అవార్డులు పొందిన విద్యార్థుల్లో పెనుమార్పులు రావాలని సూచించారు. అమెరికా, చైనా, యూరప్‌లో కంటే భారతదేశంలో యువత ఎక్కువగా ఉన్నారని, అమెరికాలోకంటే ఇంగ్లీషులో మాట్లాడేవారు భారతదేశంలో అధికంగా ఉన్నారని తెలిపారు. ప్రపంచాన్ని శాసించేది టెక్నాలజీ అని ఆ టెక్నాలజీని భారత దేశ పౌరులు శాసించే స్థాయికి వచ్చారని ఆయన పేర్కొన్నారు. ఐటీకి ప్రాధాన్యత ఇచ్చి ఇంజనీరింగ్ కాలేజీలు, హైదరాబాదులో హైటెక్ సిటీ, సైబారాబాదును నిర్మిస్తే ప్రపంచ దేశాల్లో
తెలుగువారు నెంబర్‌వన్ స్థానంలో ఉన్నారని ఆయన తెలిపారు. రాష్ట్రానికి యువతే పెద్ద ఆస్తి అని రాష్ట్రంలో 81లక్షలమంది విద్యార్థులు ఉన్నారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర విభజన తరువాత కట్టుబట్టలతో బయటకు వచ్చామని ఆయన తెలిపారు. ప్రపంచ పటంలోకి హైదరాబాదును తీసుకువెళ్ళామని, 2029 నాటికి అమరావతిని కూడా ప్రపంచపటంలోకి చేరుస్తామని ఆయన వెల్లడించారు. విద్యార్థులను క్షేత్రస్ధాయిలో అనుసంధానం చేయాలనే ఉద్దేశ్యంతో గ్రామాలకు పంపుతున్నామని, అందులో భాగంగా జ్ఞానభేరి పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. సమాజంలో ఉండే సమస్యలపట్ల విద్యార్థులు అధ్యయనం చేసి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్‌లో ముందంజలో ఉందన్నారు. మెరుగైన జీవన ప్రమాణాలు వస్తున్నాయని, దీవి సీమలో పెద్దఎత్తున తుఫాన్ వస్తే 20వేలమంది చనిపోయారని, 1996తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హరికేన్ తుఫాన్ వచ్చిన సమయంలో 2500మంది, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు 35మంది చనిపోగా ఇటీవల వచ్చిన తిత్లీ తుఫాన్‌కు సాంకేతికను వినియోగించుకుని మరణాల సంఖ్య గణనీయంగా తగ్గించగలిగామన్నారు. ప్రతి ఒక్కరు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు.
ఇటీవల ఒక సర్వేలో దేశం మొత్తంమీద మన రాష్ట్రం తక్కువ అవినీతిలో మూడవస్థానంలో వచ్చిందన్నారు. రానున్న రోజుల్లో అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని ఆయన వెల్లడించారు. అవినీతిపై కలాం పోరాటానికి పిలుపునిచ్చారని ఆయన పేర్కొన్నారు. అభివృద్ధిలో రాష్ట్రానికి డబల్ డిజిట్ వచ్చిందని, మూడుసార్లు ఇనె్వస్టర్ల మీటింగ్ ఏర్పాటుచేయగా 16లక్షల కోట్ల రూపాయలు ఎంఓయు వచ్చాయని దీంతో 32లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. చదువుకోలేని పిల్లలను చదువుకునే విధంగా తయారుచేయాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. 2019 మార్చి నాటికి నాలెడ్జ్ అంటే నవ్యాంధ్ర రాష్ట్రంగా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు 2550మందికి పదిలక్షల నుండి 15 లక్షల రూపాయల వరకు ఈ సంవత్సరం విదేశీ విద్యకోసం ఖర్చుపెడుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
ఐఎఎస్ కావాలనుకున్నా!
తాను ఐఎఎస్ కావాలని అనుకున్నానని, కాని రాజకీయనాయకుడిని అయ్యానని తన గత స్మతులను ముఖ్యమంత్రి తలచుకున్నారు. విద్యార్థులు అవార్డులు స్వీకరించటం ఎంత ముఖ్యమో ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోవటం అంతే ముఖ్యమని విద్యార్థిలోకానికి పిలుపునిచ్చారు. ప్రతి విద్యార్థికి విజన్ అవసరమని, సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమి లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఈ బహిరంగసభలో రాష్ట్ర విద్యా శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు, అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు, జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, శాసనమండలి సభ్యులు కరణం బలరాం, మాగుంట శ్రీనివాసులరెడ్డి, కత్తి నరసింహరెడ్డి, యండపల్లి శ్రీనివాసరెడ్డి, పోతుల సునీత, బాపట్ల పార్లమెంటు సభ్యులు శ్రీరాం మాల్యాద్రి, శాసనసభ్యులు డోలా బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, ఆమంచి కృష్ణమోహన్, పాలపర్తి డేవిడ్‌రాజు, ఏలూరి సాంబశివరావు, పోతుల రామారావు, ముత్తుమల అశోక్‌రెడ్డి,ఎస్‌సి కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్, జిల్లాకలెక్టర్ వి వినయ్‌చంద్ తదితరులు పాల్గొన్నారు.

చిత్రం..ఒంగోలులో సోమవారం జరిగిన కార్యక్రమంలో విద్యార్థులకు అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారాల ప్రదానం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.